2019 ఎన్నికలల్లో టీడీపీ కచ్చితంగా గెలిచే సీట్లలో గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం ఉంటుందని తమ్ముళ్ళు గట్టిగా ఆశలు పెట్టుకున్నారు. అయితే జగన్ గాలి సునామీలా ఉండటంతో గురజాలలో టీడీపీకి ఓటమి ఎదురైంది. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలిచిన కమ్మ సామాజికవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు  అనూహ్యంగా వైసీపీ నేత కాసు మహేశ్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

 

సుమారు 28 వేల ఓట్ల తేడాతో యరపతినేని ఓడిపోవడంతో టీడీపీ శ్రేణులు ఖంగుతిన్నాయి. అయితే ఓడిపోయినా ఏడాదిలోనే గురజాల పరిస్థితులు మారిపోయినట్లు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేగా కాసు మహేశ్ రెడ్డి పనితీరు ఏమి పెద్ద బాగోలేదని తెలుస్తోంది. పైగా ఆయనపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఆయన అనుచరులు దందాలు కూడా ఎక్కువైనట్లు తెలుస్తోంది. అక్రమ మద్యం రవాణా, నాటు సారా, గుట్కా, రేషన్ మాఫీయాలు ఎక్కువ జరుగుతున్నాయని, అలాగే బ్లీచింగ్‌లో సున్నం కలిపేసి పెద్ద స్కామ్ జరుగుతుందని టాక్.

 

దీంతో కాసుపై నెగిటివ్ పెరిగినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో యరపతినేని ఓడిపోయినా దగ్గర నుంచి, ప్రజలకు అందుబాటులో ఉంటూ, కార్యకర్తలని కలుపుకుని పోతూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. అలాగే వైసీపీ నేతల అక్రమాలపై నిత్యం మీడియాతో మాట్లాడుతూ...ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు యరపతినేని కూడా పలు అక్రమాలు చేసినట్లు వార్తలు వచ్చాయి.

 

అలాగే ఆయనపై పలు కేసులు కూడా ఉన్నాయి. కాకపోతే ఆయన మీద కేసులు, ఆరోపణలు ఉన్నా కూడా నియోజకవర్గాన్ని బాగానే అభివృద్ధి చేశారని తెలిసింది. ఆ ఐదేళ్లలో కొత్త సిమెంట్ రోడ్లు వేయడం, స్కూల్, అంగన్‌వాడీ భవనాలు కట్టించడం, త్రాగునీటి సమస్యలు తగ్గించారు. అయితే కాసు వచ్చాక పెద్దగా అభివృద్ధి ఏమి జరగలేదని,  పైగా అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దీని వల్ల కాసుపై జనాల్లో వ్యతిరేకిత పెరిగిందని, అదే యరపతినేనికి అడ్వాంటేజ్ అయిందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: