ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దు ల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. భారత దేశానికి చెందిన కొంత భూభాగా న్ని ఆక్రమించు కునేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోంది. అయితే భారత్ ఎంత చెప్పి నప్పటికీ చైనా సైన్యం వెనక్కి వెళ్లేందుకు మాత్రం  అంగీకరించడం లేదు. ఆ సమయం లో భారత్ తో  యుద్ధాని కి మాత్రం ముందుకు రావడం లేదు చైనా. కేవలం చర్చల పేరు తో ప్రస్తుతం సరిహద్దు లో కాలక్షేపం చేస్తుంది. 

 

 గాల్వాన్ లోయ  ప్రాంతాన్ని మొత్తం చైనాకు వదిలేయాలి అంటూ చైనా డిమాండ్ చేస్తుంటే.. ఒకప్పుడు ఈ లోయను ఆక్రమించు కున్నారని ఇది మా భూ భాగం మాకు వదిలేయండి అంటూ భారత సైన్యం కోరుతోంది. అయితే ప్రస్తుతం ఇలాంటి వివాదానికి  అసలు కారణం ఏమిటి అంటే.. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్  తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు అని అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పైన వ్యాపార వాణిజ్య రంగాల నుండీ  ఒత్తిడి బాగా పెరిగిపోతోంది అంటున్నారు విశ్లేషకు లు. 

 


 ప్రస్తుతం చైనాలో విదేశీ పెట్టుబడులు 80 శాతం ఉంటే చైనా కు సంబంధించిన పెట్టుబడులు మాత్రం 20 శాతం ఉన్నాయని ఇక దీని ద్వారా వచ్చిన ఆదాయా న్ని ఇలా ఇతర దేశాల వివాదాకు  ఆక్రమించు కునేందుకు ఖర్చు చేస్తున్నారు అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్త మవుతోంది చైనాలో. అంతేకాకుండా ఉపాధి అవకాశా లు తగ్గుతూ ఉండటం జీడీపీ  రేట్  తగ్గుతూ ఉండటం కారణంగా జిన్ పింగ్ పై మరింత ఒత్తిడి పెరిగిందని అంటున్నారు. వీటన్నింటినీ డైవర్ట్  చేసేందు కే ప్రస్తుతం చైనా  భారత తో  వివాదాని కి దిగారు అని అంటున్నారు విశ్లేషకులు,

మరింత సమాచారం తెలుసుకోండి: