నెల్లూరు కు సంబంధించినటువంటి టూరిజం అధికారి ఉషారాణి పై సహోద్యోగి మాస్క్ ఎందుకు పెట్టుకోలేదు అని అడిగినందుకు దారుణంగా దాడి చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో నిన్న సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయింది. ఇక దీనిపై వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం దాడి చేసిన సదరు ఉద్యోగిని ఉద్యోగం తీసివేస్తూ నిర్ణయం తీసుకుంది.  అంతేకాకుండా ఉషారాణి కి  మద్దతుగా మహిళా సంఘాలు కూడా కదిలాయి. అయితే జగన్ సర్కార్ ఈ ఘటనపై ఎంతో వేగంగా స్పందించింది. దీనిపైస్పందించిన  చంద్రబాబు ఒక సూపర్ పాయింట్ తెరమీదకు తెచ్చారు. 

 


 వాస్తవానికి నెల్లూరు డివిజన్ కార్యాలయంలో ఉషారాణి అనే.. డిప్యూటీ మేనేజర్ భాస్కర్ విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి  ఘటన జరిగింది ఈ నెల 27వ తేదీన జరిగిందని.. కానీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం ఇవాళ వైరల్ అయింది అంటూ  చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే దాడికి పాల్పడిన వ్యక్తిని ఎందుకు అరెస్టు చేయకుండా మూడు రోజులు పాటు అతని కాపాడారు..?  బాధితురాలికి రక్షణ ఎక్కడుంది..?  దాడి చేసిన వ్యక్తిని కాపాడింది ఎవరు.?  

 


 అత్యవసర పరిస్థితుల్లో ఆశ్రయించే  మహిళల పట్ల పోలీసుల ప్రవర్తన ఇలాగే ఉంటుందా..? . మహిళా రక్షణ అంటూ ఊదరగొట్టి ఇప్పుడు ఎందుకు మాట్లాడకుండా సైలెంట్ గా ఉండి పోయారు..? ఇది చేతకానితనం కాకపోతే మరి ఏంటి..? ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు శాంతిభద్రతలు క్షీణించి పోతున్నాయి అనడానికి ఈ ఘటన నిదర్శనంగా మారింది, అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు చెప్పినట్లుగా ఇది మూడు రోజుల కిందట జరిగిన వ్యవహారం అయితే ఈ రోజు వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు.. ఏది నిజం అనేది స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత అధికార పక్షంపై ఉంది అంటున్నారు విశ్లేషకులు,

మరింత సమాచారం తెలుసుకోండి: