దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడులోని సతన్ కుళం పోలీస్ స్టేషన్ లో జరిగిన తండ్రి కొడుకుల కస్టోడియల్ డెత్ ఘటన లో ఎస్ ఐ రఘు గణేష్ ను కొద్దీ సేపటి క్రితం సీబీ సీఐడీ అరెస్ట్ చేసింది. సెక్షన్ 302 హత్య నేరం కింద రఘు గణేష్ అరెస్ట్ అయ్యాడు. ఈ కేసులో అతని తోపాటు నిందితులుగా వున్న ఎస్ ఐ బాలకృష్ణన్ ,ఇన్ స్పెక్టర్ శ్రీధర్ తో సహా మరో ముగ్గురు పోలీసులను త్వరలోనే అరెస్ట్ చేయనున్నారు. 
ఇక కేసు విషయానికి వస్తే ఈనెల 19న మొబైల్ షాప్ యజమానులైన తండ్రి కొడుకులు జయరాజ్ (59), బెనిక్స్ (31) లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా కర్ఫ్యూ సమయంలో షాప్ తెరిచివుంచారు దాంతో సతన్కుళం పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఇక స్టేషన్ లో వారిపై  పోలీసులు తమ ప్రతాపం చూపించారు. ఇద్దరిని రాత్రి అంతా రక్తాలు వచ్చేలా కొట్టారు. ఆ దెబ్బలకు  కోవిల్పట్టి ఆసుపత్రి లో చికిత్స పొందుతూ జూన్ 22న  బెనిక్స్ మృతి చెందగా  మరుసటి రోజు జయరాజ్ మృతి చెందాడు. దాంతో పోలీసుల తీరును నిరసిస్తూ ,బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సామాన్య ప్రజలతో పాటు సెలబ్రెటీలు కూడా గొంతు కలపడం తో ఒత్తిడికి తలొగ్గిన తమిళనాడు ప్రభుత్వం సోమవారం ఈ కేసును సిబిఐకి బదిలీ చేసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: