ఒకప్పుడు కుయ్ కుయ్ అని సౌండ్ వినబడితే చాలు. రాజశేఖర్ రెడ్డి గుర్తుకు వచ్చే వారు. ఎక్కడ ఏ చిన్న ప్రమాదం జరిగినా, క్షణాల్లో 108 అంబులెన్స్ వాలిపోయేది. ఏదైనా ప్రమాదం జరిగినా, వైద్యపరంగా ఎవరికైనా అత్యవసర పరిస్థితి వచ్చినా, ప్రాథమిక చికిత్స అందిస్తూ ఆస్పత్రికి తీసుకు వెళ్లే లోపు ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడేది. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వానికి ఎక్కడలేని పేరుప్రఖ్యాతులు తీసుకురావడంలో 108 అంబులెన్స్ పాత్ర ఎనలేనిది. ఇక రాజశేఖర్ రెడ్డి కూడా ఏ ప్రచార సభకు వెళ్లినా , ప్రజలను ఆకట్టుకునేందుకు కుయ్ కుయ్ అంటూ అంబులెన్స్ శబ్దాలను అనుకరించేవారు. ఈ ప్రభావం ప్రజల్లో బాగా కనిపించేది. ఇక రాజశేఖరరెడ్డి మరణాంతరం, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఈ 108 అంబులెన్స్ నిర్వహణ విషయంలో అంతగా చొరవ చూపించకపోవడం, తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ పూర్తిగా 108 అంబులెన్స్ వ్యవహారాన్ని పక్కన పెట్టడంతో, చాలావరకు అంబులెన్సులు మూలనపడ్డాయి.

 

కొన్ని అంబులెన్సులు సక్రమంగానే ఉన్నా, వాటికి డీజిల్ కొట్టించే పరిస్థితి లేకపోవడం, సిబ్బంది కొరత ఎలా ఎన్నో సమస్యలతో 108 అంబులెన్స్ రాష్ట్రవ్యాప్తంగా మూలను పడటమే కాకుండా, కుయ్ కుయ్ శబ్దాలు ఏపీలో కనుమరుగైపోయాయి. మళ్లీ ఇంతకాలానికి  శబ్దాలు కుయ్ కుయ్ మంటూ సందడి చేస్తున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం నిర్వహణ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. చాలా చోట్ల అంబులెన్సులు ఎందుకు పనికి రాకుండా పోయాయి. దీంతో కొత్తగా 1088 అంబులెన్సులను కొనుగోలు చేసి ఇప్పుడు రోడ్లపై కుయ్ కుయ్  అనిపిస్తున్నారు. గతం కంటే మెరుగైన సౌకర్యాలు అంబులెన్స్ లలో  కల్పించడమే కాకుండా, సిబ్బంది జీతభత్యాలను కూడా ఏపీ ప్రభుత్వం భారీగా పెంచడంతో, జగన్ వీటికి ఇచ్చే ప్రాధాన్యత ఏంటనేది బాగా అర్ధం అవుతోంది.

IHG's Ideals Have Carved A Path For Me: YS Jagan

అసలే ఇది కరోనా కాలం, అలాగే ఆర్థికపరంగా కరువు కాలం కూడా. అయినా, ఇంత భారీ వ్యయంతో కూడిన 108 అంబులెన్స్ సర్వీసులను జగన్ ప్రారంభించడం నిజంగా సాహసమే అని చెప్పాలి. దీనిపై జగన్ కు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. 13 జిల్లాల్లో 676 మండలాల్లో రోడ్లపై తిరుగుతూ 108 అంబులెన్స్లు కనిపించబోతున్నాయి. ప్రజలకు మళ్లీ రాజశేఖర్ రెడ్డి పాలన గుర్తుచేసుకుంటూ, జగన్ పాలన గురించి గొప్పగా చెప్పుకునేందుకు ఈ కుయ్ కుయ్ వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయి అనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: