సౌత్ లో కరోనా విజృంభణ కొనసాగుతూనే వుంది. లాక్ డౌన్ 4వరకు ఒక్క తమిళనాడులోనే కరోనా ప్రభావం అధికంగా ఉండగా అన్ లాక్ 1.0 ప్రారంభమైన దగ్గర నుండి అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తమిళనాడు తరువాత ప్రస్తుతం  కర్ణాటక, తెలంగాణలో కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఇక ఈరోజు తమిళనాడు లో 3882కేసులు నమోదు కాగా కర్ణాటక లో రికార్డు స్థాయిలో 1272కేసులు బయటపడ్డాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో 657కేసులు నమోదు కాగా తెలంగాణలోనైతే 1008 కరోనా కేసులు నమోదయ్యాయి.    
 
ఇక వీటితో పోలిస్తే కేరళ పరిస్థితే కొంచెం మెరుగ్గా వుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 151కేసులు నమోదుకాగా ఓ మరణం కూడా సంభవించింది. ఇప్పటివరకు కేరళలో మొత్తం 4593కేసులు నమోదుకాగా అందులో 2130కేసులు యాక్టీవ్ గా వున్నాయి అలాగే 2436మంది బాధితులు కరోనా నుండి కోలుకోగా 25మంది మరణించారని కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.
ఇదిలావుంటే ఈఒక్క రోజే దేశ వ్యాప్తంగా 19000కుపైగా కేసులు నమోదు కాగా మొత్తం దేశంలో కరోనా కేసుల సంఖ్య 600000 దాటింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: