ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీ లకు కేరాఫ్ అడ్రస్ గా పేరున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. సమాజంలో మనుషులను ప్రభావితం చేసే పాయింట్లతో ఆయా వ్యక్తుల జీవిత చరిత్ర లతో సినిమాలు చిత్రీకరిస్తూ చాలా డబ్బులు సంపాదించడం లో వర్మ ను మించిన డైరెక్టర్ మరొకరు ఉండరు అని చాలామంది అంటారు. అంతేకాకుండా రాజకీయ రంగాలలో ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకుని సినిమాలు తీస్తూ మరొకరిని రెచ్చగొట్టే విధంగా వర్మ సినిమాలు తీయటం ఈమధ్య చాలానే చూశాం. అలాంటి రామ్ గోపాల్ వర్మ కి రాజకీయాలంటే ఏమీ తెలియదు కానీ కేవలం సినిమాలు మాత్రమే తెలుసు పొలిటికల్ విషయాల్లో వర్మ అమాయకుడు ఆఫ్ ఇండియా అని కొంతమంది ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు, ఆయన తీసే సినిమాలో ఎటువంటి తప్పు లేదు అన్న వాళ్ళు చెబుతుంటారు.

 

ఇదిలా ఉండగా వర్మకి మరియు వైసీపీ పార్టీకి అంతర్గతంగా ఒక డీల్ ఉందని కొంతమంది ఇటీవల 'పవర్ స్టార్' అనే టైటిల్ పెట్టిన తర్వాత కామెంట్స్ చేస్తున్నారు. విషయం ఏమిటంటే ఇటీవల వైసిపి ప్రభుత్వం వైయస్సార్ కాపు రిజర్వేషన్ పేరిట కొన్ని పథకాలు ప్రకటించడం జరిగింది. అయితే జగన్ ప్రభుత్వం ప్రకటించిన పథకాలలో కాపులను మోసం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ మీడియా సాక్షిగా ప్రశ్నించడం జరిగింది. పొలిటికల్ గా ఇదంతా మీడియాలో వైరల్ అవుతున్న సరైన సమయంలో రామ్ గోపాల్ వర్మ అనూహ్యంగా 'పవర్ స్టార్' అనే టైటిల్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది.

 

సరిగ్గా పొలిటికల్ గా కాపులు వర్సెస్ వైసిపి పార్టీ అన్న విధంగా రాజకీయం ఏపీలో మారే పరిస్థితి ఉన్న టైంలో వర్మ కావాలనే ఈ విధంగా వ్యవహరించారని టాక్ నడుస్తుంది. రాంగోపాల్ వర్మ కి వైసీపీ పార్టీకి అంతర్గతంగా డీల్ కుదిరిందని… అందువల్లే రాజకీయాలంటే ఇష్టం లేని ఆర్జీవి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వెళ్లటం జరిగిందని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా పొలిటికల్ గా వైసిపి పార్టీకి డ్యామేజ్ జరిగే సమయంలో ఆర్జివి తన ఫార్ములా ఉపయోగిస్తూ ప్రజల దృష్టిని మరల్చు తున్నారని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: