ఏపీ రాజకీయాల్లో కులాలది కీలక పాత్ర అన్న సంగతి చాలా మంది ఒప్పుకుంటారు. అందులోనూ రాష్ట్రం విడిపోయాక ఈ కులాల సంఘర్షణ మరింత ఎక్కువైంది. చంద్రబాబు హయాంలో కమ్మలదే అంతా రాజ్యం అన్న ప్రచారం ఆయనకు బాగా మైనస్ అయ్యింది. ఇప్పుడు జగన్ రాజ్యంలో రెడ్డిలకే పెద్ద పీట అంటూ విమర్శలు వస్తున్నాయి. ప్రత్యేకించి జగన్ కమ్మలను టార్గెట్ చేశారన్న వాదన కూడా వినిపిస్తుంది.

 

 

 

ఇలాంటి నేపథ్యంలో జగన్ స్వయంగా ఓ చౌదరిగారిని తెగ మెచ్చుకున్నారు. ఇదంతా చౌదరన్న మంచి మనసు ఫలితం అంటూ ప్రశంసించారు. మరి అంతగా జగన్ ప్రశంసలు పొందిన ఆ చౌదరి గారు ఎవరు.. జగన్ ఎందుకు మీడియా ముందు అంతగా పొగిడేశారు. ఆయన చేసిన గొప్పదనం ఏంటి..? అంటే.. గుంటూరులోని జీజీహెచ్‌లో రూ.50 కోట్ల నిధులతో నాట్కో కేన్సర్‌ బ్లాక్‌ను ఏర్పాటు చేశారు.

 

IHG

 

ఈ మంచి కార్యక్రమానికి నాట్కోట్రస్టు చేయూత ఇచ్చింది. జగన్ మెచ్చుకున్న వెంకయ్య చౌదరి అన్న ఈ ట్రస్టుకు చెందిన వారే. ఆయన ఏకంగా 30 కోట్ల వరకూ ఈ క్యాన్సర్ కేంద్రం కోసం సమకూర్చారు. ఇక ప్రభుత్వం 20 కోట్ల వరకూ వెచ్చించి భవనం, మౌలిక సదుపాయాలు కల్పించింది. క్యాన్సర్ కేంద్రాన్ని సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ప్రారంభించారు.

 

 

ఈ కేంద్రం గురించి సీఎం మాట్లాడుతూ.. “ ఈ రోజు క్యాన్సర్‌కు సంబంధించి విభాగం మొదలు పెడుతున్నాం. ఇటువంటి క్యాన్సర్‌ కేర్‌ సెంటర్‌ ప్రభుత్వ ఆధీనంలో ఉండటం ఇది మొట్ట మొదటి సారి. మూడు విభాగాలు ఈ సెంటర్లో అందుబాటులో ఉంటాయి. రెడియోథెరఫీకి సంబంధించి రెండు సీట్లు కూడా సాధించాం. ఇది గొప్ప విజయం. ఇది రావడానికి వెంకయ్య చౌదరి ముందుకు రావడం, మరో రూ.25 కోట్లతో హై ఎక్విప్‌మెంట్ ‌ను ప్రభుత్వమే తీసుకురావడం జరిగింది.. అంటూ గుర్తు చేసుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: