తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పొలిటికల్ రీ ఎంట్రీ గ్రాండ్ గా ఇచ్చేందుకు సిద్ధం అయిపోతోంది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి మొన్నటి ఎన్నికల్లో ఓటమి చెందిన తరువాత కవిత రాజకీయంగా అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. ఎప్పటి నుంచే ఆమె మళ్ళీ తెలంగాణ పొలిటిక్స్ లోకి రీ ఎంట్రీ ఇచ్చి పార్టీకి మరింత మైలేజ్ తీసుకొస్తారని అంతా ఆశలు పెట్టుకున్నా , ఆమె మాత్రం సైలెంట్ గానే ఉండిపోయారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో తాను తప్పనిసరిగా గెలుస్తా అని ఆశించారు. కానీ అనూహ్యంగా  ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలవడంతో, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ యాక్టివ్ అయ్యి పార్టీలో తన పరపతి పెంచుకోవాలని  కవిత డిసైడయ్యారు.

 

ఎలాగూ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు వెళ్లాలనే ఆలోచనలో ఉండడంతో, ఆయన ఒత్తిడి మేరకు కవిత మళ్లీ పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఇప్పటికీ ఆమెను ఎమ్మెల్సీగా చేసి తెలంగాణ క్యాబినెట్ లో మంత్రి పదవి కట్టబెట్టాలని కెసిఆర్ భావించినా,  ఎమ్మెల్సీ ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడింది. మంత్రి పదవి వచ్చే వరకు వెయిటింగ్ చేయడం కంటే, ఏదో ఒక అంశం తో ప్రజల్లోకి వెళ్లడమే మంచిదనే ఆలోచనతో కవిత ఉన్నారు. సరిగ్గా ఇదే సమయంలో బిజెపి తెలంగాణలో బలం పడుతుండటం, పదేపదే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ముందుకు వెళ్తున్న మన వంటి పరిణామాల నేపథ్యంలో బీజేపీపై పోరాడేందుకు సిద్ధమయ్యారు. దేశవ్యాప్తంగా బిజెపి ప్రభుత్వం బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేస్తూ వస్తున్న నేపథ్యంలో తెలంగాణలోనూ ఆ విధంగా బిజెపి ప్రభుత్వం ముందుకు వెళ్లే ఆలోచనతో ఉండడంతో, కవిత ఇప్పుడు ఆ అంశం ద్వారా బిజెపిని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు.

 

ఇప్పటికే 24 గంటల సింగరేణి సమ్మెకు పిలుపునిచ్చారు. ఎక్కడికక్కడ బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూ, ఆ పార్టీ పరపతి తగ్గిస్తూ, తన పొలిటికల్ ఎంట్రీ ని మరింత స్ట్రాంగ్ చేసుకోవాలని కవిత భావిస్తున్నారు. కవిత పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తే, తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయని, పార్టీలో నూతన ఉత్సాహం వస్తుందని ఆశాభావం టిఆర్ఎస్ శ్రేణుల్లో ఉంది. సింగరేణి వంటి ఉద్యమాన్ని భుజాన వేసుకోవడం ద్వారా, క్షేత్ర స్థాయిలో బలం పెంచుకునేందుకు ఈ అంశం తనకు బాగా దోహదం చేస్తుందనే అభిప్రాయం ఉంది. కేసీఆర్ కూడా ఇదే సరైన పద్ధతి అని, బలమైన నాయకురాలిగా నిరూపించుకునేందుకు ఈ అంశం బాగా ఉపయోగపడుతుందని సూచించడంతో ఆవిధంగానే కవిత ముందుకు వెళ్తున్నట్టు గా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: