ఇండియాలో కరోనా వైరస్ భయంకరంగా వ్యాప్తి చెందింది. మొదటిలో ప్రపంచ దేశాలలో చాలా వరకు ఇండియా కరోనా వైరస్ తో పోరాడే విషయంలో మెరుగైన స్థానంలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసల వర్షం కురిపించింది. ఇంకా అభివృద్ధి చెందిన దేశాలు కూడా కరోనా పుట్టినిల్లు చైనా పక్కన అది అత్యధిక జనాభా కలిగిన ఇండియాలో కరోనా వైరస్ ని భారతీయులు అద్భుతంగా ఎదుర్కొంటున్నారు అంటూ అభినందనలు తెలిపారు. సీన్ కట్ చేస్తే లాక్డౌన్ నాలుగో దశ ఎత్తివేసిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు ప్రజెంట్ నమోదవుతున్న కొత్త పాజిటివ్ కేసులకు కేంద్ర ప్రభుత్వం మరియు వైద్యరంగంలో టెన్షన్ నెలకొంది. ఇదే సమయంలో వర్షాకాలం రావడంతో వైరస్ మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని కేంద్ర పెద్దలు మరియు వైద్యులు తెలుపుతున్నారు.

 

ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ సమాజంలో ఇతరులకు హానికరంగా ఉండకుండా కరోనా కట్టడి చేయడంలో ప్రభుత్వ సూచనలు ప్రతి ఒక్కరు పాటించాలని ప్రభుత్వాలు తెలుపుతున్నాయి. కాగా ఇండియా లో అన్ని రాష్ట్రాల పరిస్థితి ఒకలా ఉంటే మిజోరంలో మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. ప్రజెంట్ ఈ రాష్ట్రం లాక్ డౌన్ లో ఉంది. ఇక్కడ కేసుల సంఖ్య చూసిన ఆశ్చర్యం కలుగుతుంది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 150. వారిలో దాదాపు 35 మంది కరోనా నుంచి కోలుకోవడం జరిగింది. ఈనేపథ్యంలో మిజోరం రాష్ట్రం లో వైరస్ అస్సలు ఎంటర్ అవ్వకుండా అక్కడ ఉన్నా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది.

 

ముఖ్యంగా ప్రభుత్వంతో పాటు ఆ రాష్ట్రంలో స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి మరియు చర్యల వల్ల కరోనా కట్టడి  విషయంలో మిజోరాం సక్సెస్ అయిందని జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు చెందిన వారు అక్రమంగా చొరబడకుండా రాష్ట్రంలో ఉన్న స్వచ్ఛంద సంస్థకి చెందిన వారు ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా సరిహద్దుల్లో కాపలా కాయడం వలన మిజోరాం కరోనా వైరస్ ని ఇండియాలో ఎదుర్కొన్న రాష్ట్రంగా మంచి పేరు ప్రజెంట్ సంపాదిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: