కరోనా..ప్రపంచాన్ని భయపెడుతున్న సమస్య ఇది. మరి ఇది మనకు వచ్చిందా రాలేదా అన్న విషయం తెలుసుకోవడం ఎలా.. ఇందుకు ఇప్పటి వరకూ అనుసరిస్తున్న విధానం స్వాబ్ పద్దతి. అంటే అనుమానితుల గొంతు, ముక్కు నుంచి స్రావాలను సేకరించి వాటిని పరీక్షిస్తున్నారు. కానీ ఇది చాలా ఇబ్బందికరమైన పద్దతి.

 

 

కానీ ప్రస్తుతానికి అంతకు మించి వేరే దారి లేదు. కానీ ఇప్పుడు ఓ గుడ్‌ న్యూస్ వచ్చింది. కరోనా రోగుల రక్త పరీక్షల నివేదికల ద్వారా కూడా వారిలో వైరస్ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అంచనా వేయొచ్చట. అమెరికన్ పరిశోధకులు ఈ విషయం కనిపెట్టేశారు. వర్జీనియా స్కూల్ ఆఫ్ మెడిసిన్ సైంటిస్టులు ఈ విషయం తేల్చి చెప్పారు.

 

 

రోగ నిరోధక వ్యవస్థలోని కణాలు విడుదల చేసే కొవ్వు పదార్థమైన సైటోకీన్ ద్వారా దీన్నికనిపెట్టొచ్చట. ఈ సైటోకీన్ యే.. కరోనా రోగుల్లో రోగనిరోధక వ్యవస్థ చర్యలకు, ఆరోగ్య విషమస్థితికి కారణం. రక్త పరీక్షల ద్వారా ఈ సైటోకీన్ ల స్థాయిని తెలుసుకోవడం ద్వారా రోగికి ఉన్న ప్రమాద తీవ్రతను వైద్యులు అంచనా వేయొచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.

 

 

అంతే కాదు.. ఈ రక్త పరీక్షల ద్వారా రోగులకు వేరే ఇతర కొత్త చికిత్సలను వైద్యులు సూచించేందుకు అవకాశం ఉంటుందట. 50 మంది కొవిడ్ రోగుల నుంచి సేకరించి రక్తనమూనాలను పరీక్షించిన సైంటిస్టులు ఈ మేరకు ఓ నిర్ధరణకి వచ్చారు. ఈ రక్త పరీక్ష ద్వారా రోగికి వెంటిలేటర్ అమర్చాలా వద్దో కూడా నిర్ణయించవచ్చట. అంతే కాదు..సైటోకీన్ ఉద్ధృతి ఎక్కువగా ఉంటే ఏవిధమైన చికిత్స అవసరమో కూడా కూడా చెప్పొచ్చట.

మరింత సమాచారం తెలుసుకోండి: