కరోనా టెస్టుల విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది తెలంగాణ సర్కార్. తాజాగా నిన్న మరోసారి హైకోర్టు ఈవిషయంలో రాష్ట్ర ప్రభుత్వం పై మండిపడింది. వారం రోజుల్లోనే 50000 టెస్టులు చేస్తామని చెప్పి ఎందుకు చేయలేదని ప్రశ్నించింది. ఇక ఎలాగైనా టెస్టుల సంఖ్య పెంచాలనుకున్న ప్రభుత్వం.. హైదరాబాద్ లో మొత్తం 11 హాస్పిటల్ లలో ఉచితంగా కరోనా టెస్టులు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈమేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆ 11ఆసుపత్రుల పేర్లను ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. 
 
కింగ్ కోఠి ఆసుపత్రి (కోఠి ),ఫీవర్ ఆసుపత్రి(నల్లకుంట),చెస్ట్ ఆసుపత్రి (ఎర్రగడ్డ),నేచర్ క్యూర్ ఆసుపత్రి (అమీర్ పేట),సరోజినీ దేవి కంటి ఆసుపత్రి (మెహదీ పట్నం), ఆయుర్వేద ఆసుపత్రి (ఎర్రగడ్డ),హోమియోపతి ఆసుపత్రి (రామంతాపూర్), నిజామియా టీబీ ఆసుపత్రి(చార్మినార్),ఏరియా ఆసుపత్రి (కొండాపూర్),ఏరియా ఆసుపత్రి(వనస్థలిపురం), ఈఎస్ఐ ఆసుపత్రి (నాచారం) లలో ఉచితంగా కరోనా పరీక్షలు చేయనున్నారు. 
 
మరోవైపు రాష్ట్రంలో కరోనా హవా ఏమాత్రం తగ్గడం లేదు నిన్న ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 1018 పాజిటివ్ కేసులు వచ్చినట్లు  రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది అందులో ఒక్క జిహెచ్ఎంసి లోనే  881 పాజిటివ్ కేసులు  బయటపడటం గమనార్హం. ఈకేసులతో కలిపి నిన్నటివరకు తెలంగాణలో మొత్తం17357 కరోనా కేసులు నమోదవ్వగా అందులో 8082మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 9008కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఈరోజు కరోనాతో 7గురు మరణించడంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 267కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: