నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కి పార్టీలో సరైన స్థానం కల్పించడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2014 ఎన్నికల టైంలో చంద్రబాబు గెలిచిన తర్వాత పార్టీ తరఫున ఎమ్మెల్సీగా పాలిటిక్స్ లో అడుగుపెట్టిన నారా లోకేష్ వెంటనే మంత్రి పదవులు చేపట్టడం జరిగింది. చంద్రబాబు కొడుకు కావడంతో రాజకీయాలలో రాటుతేలి తండ్రికి తగ్గ వ్యూహాలు లోకేష్ వేస్తాడని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలను అందుకోలేకపోయాడు లోకేష్. బహిరంగ వేదికలపై మాట్లాడటంలో గానీ ప్రజలతో డీల్ చేయడంలో గానీ చంద్రబాబు తరహా మాదిరిగా రాజకీయాలు చేయటం లేదని ఎక్కడా కూడా మ్యాచ్ చేయలేకపోయారు. బహిరంగ వేదికలపై మాట్లాడటంలో చాలాసార్లు నవ్వులపాలయ్యే ప్రతిపక్షాలకు ఒక ఆటబొమ్మగా దొరికిపోయిన దాఖలాలు ఉన్నాయి.

 

అటువంటి నారా లోకేష్ 2019 ఎన్నికల్లో మొట్టమొదటిసారి ప్రజాక్షేత్రంలో అది చంద్రబాబు రాజధానిగా ప్రకటించిన అమరావతి ప్రాంతం దగ్గరగా ఉన్న మంగళగిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. దీంతో లోకేష్ పార్టీ భవిష్యత్ నాయకుడిగా పెట్టుకుంటే రాజకీయ జీవితాలు ప్రమాదంలో పడినట్లే అని చాలామంది పార్టీలో ఉన్న నాయకులు అభిప్రాయపడిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత చాలా వరకూ లోకేష్ సోషల్ మీడియా లోనే ఎక్కువగా ప్రత్యర్థులపై విమర్శలు చేయడంలో ఫోకస్ పెట్టగా… ఇటీవల లాక్ డౌన్ టైములో తన ఒంటి లో పాటు మాట తీరులో కూడా అనేక మార్పులు తెచ్చుకునేలా కృషి చేయడం జరిగింది.

 

అంతే కాకుండా ఇటీవల ప్రెస్ మీట్ కి ఒక్కడే వచ్చి అధికార పార్టీని ఇరుకున పెట్టే విధంగా ప్రశ్నలు వెయ్యటం మరియు సెటైర్లు కూడా వేయడం జరిగింది. అంతేకాకుండా పార్టీకి సీనియర్ నాయకుడైన అచ్చం నాయుడు మరియు జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అవ్వడం వెంటనే ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడంతో.... ఇదంతా చూసి చాలామంది నారా లోకేష్ లో చాలా మార్పులు వచ్చాయి అని టిడిపిలో డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఇదే సరైన సమయం అనుకుని నారా లోకేష్ ని టిడిపి పార్టీకి అధ్యక్షుడిగా చంద్రబాబు చెయ్యాలని ప్లాన్ వేస్తున్నట్లు ఏపీ రాజకీయాలో  వార్తలు వస్తున్నాయి. దాదాపు చంద్రబాబుకి 70 సంవత్సరాలు దగ్గర పడిన తరుణంలో… ఇంక తన కొడుకు నారా లోకేష్ ని పూర్తిగా బరిలోకి దింపాలని బాబు అనుకుంటున్నట్లు టీడీపీ పార్టీలో టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: