2019 రిజల్ట్ దెబ్బకి తెలుగుదేశం పార్టీ కోలుకోలేని విధంగా ప్రస్తుతం సంక్షోభం ఎదుర్కొంటుంది. పార్టీ కోసం ఎంతో కష్టపడి 2014 సార్వత్రిక ఎన్నికలలో అధికారంలోకి తెచ్చిన చంద్రబాబు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేక పోయారు. కాగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ పట్ల ప్రజలకు నమ్మకం కలిగే విధంగా కూడా రాణించలేక పోతున్నారు అన్న టాక్ బలంగా వినబడుతుంది. ప్రజల దాకా ఎందుకు కనీసం పార్టీలో ఉన్న నాయకులకే ఈసారి టీడీపీ ఉంటుందో ఉండదో అనే డౌట్ ఏర్పడిందని చాలామంది అంటున్నారు. అంతే కాకుండా ఇటీవల తొందరపాటు నిర్ణయాలు ఆధారం లేని ఆరోపణలు చేయడంవల్ల ప్రజలలో తెలుగుదేశం పార్టీకి ఉన్న నమ్మకం కూడా పోతున్నట్లు వార్తలు అందుతున్నాయి.

 

ఆర్థికపరంగా అయినా జన బలం గా అయినా ఏ విధంగా చూసినా తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం భయంకరమైన క్రైసిస్ లో ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల బట్టి తెలుగుదేశం పార్టీ మళ్లీ పుంజుకోవాలంటే  జూనియర్ ఎన్టీఆర్ ని మళ్ళీ తీసుకురావడమే సరైన మార్గమని పార్టీలో సీనియర్స్ చెబుతున్నారు. ఇదే టైమ్ లో కొంతమంది అది ఇప్పుడు అప్పుడే అయ్యే పని కాదు అని చెబుతున్నారు. మరోపక్క వయసు పరంగా చంద్రబాబు కి ఏజ్ ఎక్కువైపోతున్న తరుణంలో… పార్టీలో యువ నాయకులకి  సరైన స్థానంలో పదవులు కట్టబెట్టి పోరాడాలని ప్రతిపక్ష పాత్ర సరైన విధంగా పోషిస్తే ఖచ్చితంగా మళ్లీ రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని మరికొంతమంది సూచిస్తున్నారు.

 

అలాకాకుండా ప్రజెంట్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు రాబోయే రోజుల్లో కూడా ఇలానే ఉంటే… ఏపీలో కూడా టిడిపి కనుమరుగవడం ఖాయమని సొంత పార్టీలో ఉన్న కొంతమంది చెబుతున్నారు.  ముఖ్యంగా కరోనా వైరస్ లాంటి సంక్షోభ సమయంలో అదేవిధంగా ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన టైములో ప్రతిపక్ష పాత్ర పార్టీ అధ్యక్షుడు సరిగ్గా పోషించ లేదని సొంత పార్టీ నేతలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: