గల్వాన్ ఉద్రిక్తతల తర్వాత ఇండియా చైనాకు వరుసగా షాకులిస్తూ వస్తోంది. 59 యాప్ ల నిషేధం తర్వాత మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా కంపెనీలను భారత్ ప్రాజెక్టుల నుంచి తప్పించేందుకు నిర్ణయించింది. హైవే నిర్మాణం, పారిశ్రామిక, టెలికాం, రైల్వే రంగాల్లోనూ చైనాపై వేటు వేసేందుకు రెడీ అయ్యింది. జాతీయ రహదారుల నిర్మాణ ప్రాజెక్టుల్లో చైనా సంస్థలను బహిష్కరించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తేల్చి చెప్పేశారు.

 

 

భారత్‌లో హైవే నిర్మాణ ప్రాజెక్టుల్లో చైనా సంస్థలతో పాటు.. ఆ దేశ సంస్థల భాగస్వామ్యం ఉన్న కంపెనీలను.. జాయింట్‌ వెంచర్స్‌ కూడా అనుమతించకూడదని గడ్కరీ నిర్ణయించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తారు. ఇదే సమయంలో ఈ జాతీయ రహదారి నిర్మాణ పనులను భారత సంస్థలు చేజిక్కించుకునేందుకు వీలుగా నిబంధనలు తిరిగి రూపొందిస్తారు.

 

 

ఇక ముందు ఇచ్చే టెండర్లే కాదు... ఆల్రెడీ ఇప్పటికే నిర్మాణం ప్రారంభమైన ప్రాజెక్టుల్లోనూ చైనా సంస్థలను నిషేధిస్తామన్నారు గడ్కరీ. ఇంకో షాక్ ఏంటంటే.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లోనూ చైనా సంస్థల భాగస్వామ్యానికి చెక్ పెడతారట. ఇప్పటికే ఇండియా బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రాజెక్టు టెండర్లు రద్దు చేసింది.

 

 

ఇకపై మేక్‌ ఇన్‌ ఇండియా విధానాన్ని ప్రోత్సహిస్తారు. అంతే కాదు.. చైనా సంస్థకు ప్రయోజనం కల్పించేలా ఉందన్న కారణంతో రైల్వే కూడా ఓ టెండరును రద్దు చేసింది. చైనా కు షాక్ మీద షాకులిస్తున్న ఇండియా అందుకు ప్రత్యామ్నాయాలు కూడా రెడీ చేసుకోవాలి మరి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: