గల్వాన్ లోయ ఘటన అనంతరం భారత్ చైనాకు చెందిన 59 యాప్స్ పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. భారత్ చైనాకు షాక్ ఇచ్చిన వెంటనే అమెరికా కూడా ఆ దేశానికి షాక్ ఇచ్చింది. చైనాకు చెందిన హువావే టెక్నాలజీస్, జెడ్.టీ.ఈ కార్పొరేషన్లను నిషేధిస్తూ కీలక ప్రకటన చేసింది. ఈ కంపెనీలకు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ, చైనా ఇంటలిజెన్స్, మిలిటరీలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 
 
ఈ కంపెనీలు చైనా ఇంటెలిజెన్స్ విభాగానికి సహకరిస్తామని ఒప్పందాలు కుదుర్చుకోవడంతో అమెరికా నిషేధం విధించడం గమనార్హం. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ కంపెనీలను కూడా నిషేధించాలని భారత్ పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ రెండు కంపెనీలను భారత్ నిషేధిస్తే భారత్ టెలీకాం రంగంలో పెనుమార్పులు జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఐ.ఎం.ఎఫ్ డైరెక్టర్ చాంగ్ యాంగ్ రీ కరోనా మహమ్మారి భారత వృద్ధి రేటు అంచనాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని వ్యాఖ్యలు చేశారు. 
 
భారత్ లో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోందని.... వైరస్ ను నియంత్రించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యలు చేశారు. దేశీయ మందగమనం కరోనాకు సంబంధించిన అనిశ్చితుల వల్ల స్వల్పకాలిక వృద్ధిరేటుపై అంచనాలు పెరిగాయి. ఐ.ఎం.ఎఫ్. తాజాగా 2020లో భారత్ వృద్ధి రేటు -4.5 శాతానికి పడిపోయిందని తెలిపింది. 1961 తర్వాత ఇది అత్యల్పమని ఐ.ఎం.ఎఫ్. పేర్కొంది. 
 
కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వృద్ధి రేటు మరింత దిగజారే అవకాశం ఉందని అన్నారు. కరోనా ఆతిథ్య రంగంపై భారీగా ప్రభావం చూపిందని తెలిపారు. చైనా భారత్ ఉద్రిక్తతల గురించి స్పందిస్తూ వాణిజ్య వివాదాల తీవ్రతను అందరూ నివారించుకోవాలని.... ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య సమైక్యతను పెంచడం ద్వారా భారత్ లో పెట్టుబడులు, వృద్ధి, ఉద్యోగాలు - ఉపాధి కల్పనకు సహకరిస్తుందని అన్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు దేశ ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పు అనేలా వ్యాఖ్యలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: