శుభం పలకరా.. అంటే పెళ్లి కూతురు ముండ ఎక్కడ అన్నాట్ట వెనుకటికి ఒకడు. వేమూరి రాధాకృష్ణగారి నేతృత్వంలోని జర్నలిజం కూడా అచ్చం అలాగే సాగుతోందన్నకామెంట్లు బాగా వినిపిస్తున్నాయి. జూలై ఒకటిన జగన్ సర్కారు అధునాత సౌకర్యాలతో 1088 అంబులెన్సులు ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని విజయవాడలో అట్టహాసంగా నిర్వహించింది.

 

 

వాస్తవానికి ఇది చాలా మంచి కార్యక్రమం. ప్రజలందరికీ అందాల్సిన వైద్యం, విద్య వంటి విషయాల్లో ప్రభుత్వాల పథకాలను తప్పుబట్టడం వివేకం అనిపించుకోదు. ఇక 1088 అంబులెన్సుల కార్యక్రమం ఎన్నో ప్రాణాలు నిలబెట్టే మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ధాత్రి కమ్యూనికేషన్స్ ద్వారా అన్ని మీడియా సంస్థలకు లైవ్ అవకాశం కల్పించింది.

 

 

ఏమాటకామాటే చెప్పుకోవాలి.. ఈ కార్యక్రమాన్ని జగన్ సర్కారు కూడా బాగా ప్రమోట్ చేసుకోవాలని సంకల్పించింది. అట్టహాసంగా విజయవాడ వీధుల్లో భారీ పేరెడ్ నిర్వహించింది. సీఎం కార్యక్రమం కాబట్టి ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఛానల్ కూడా బాగానే లైవ్ కవరేజ్ చేసింది. కానీ అంతసేపు లైవ్ ఇస్తే జగన్ కు మైలేజీ వస్తుందని అనుకున్నారో ఏమో.. బొక్కలు వెదకడం ప్రారంభించారు.

 

 

ఇంతలో కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు.. 1088 అంబులెన్సులు పేరేడ్ గా వెళ్తున్నప్పుడు ఓ మూడు అంబులెన్సులు ఒకదానికొకటి గుద్దుకున్నాయి. అంతే. ఈ న్యూస్ దొరకగానే ఏబీఎన్ పండుగ చేసుకుంది. తొలిరోజే అపశ్రుతి అంటూ బ్రేకింగుల మీద బ్రేకింగులు వేసింది. దీనిపై విశ్లేషణాత్మకంగా ఫోనోలు కూడా తీసుకుంది. అంత పెద్ద కార్యక్రమంలో అంత చిన్న ఘటనకు అంత హడావిడా అంటూ టీవీలు చూసే జనం ఆశ్చర్యపోయారు. ఏదేమైనా ఏబీఎన్‌ రూటే సెపరేటని సరిపెట్టుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: