ఈ కరోనా వల్ల ఒక మనుషులకే కాదు, ప్రతి జీవరాశికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీని ప్రభావం ప్రతి రంగం పై పడుతుంది. కాకపోతే మనుషులకు నోరు ఉంది కాబట్టి చెప్పుకుంటున్నారు.అదే మూగజీవులు ఎవరితో చెప్పుకోలేవు, ఈ సమయంలో వాటిబాధ ఎవరు అర్ధం చేసుకోలేరు కూడా అదీగాక కొందరైతే మరీ మూర్ఖంగా జంతువుల ప్రాణాలు తీస్తున్నారు.. కొందరు పనికిమాలిన వెధవలైతే కోతిని అన్యాయంగా చెట్టుకు ఉరిపెట్టి చంపారు..

 

 

ఇక వన్యమృగాలు కూడా జనవాసాల్లోకి వచ్చి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తు, అవి కష్టాలు పడుతున్నాయి.. అయితే వీటన్నీంటికి భిన్నంగా థాయ్‌లాండ్‌లోని లోప్‌బురిలో కోతులు వాటికోసం ఒక రాజ్యాన్నే ఏర్పరచుకున్నాయట.. అసలే కోతి, దానికి తోడు మరిన్ని కోతులు తోడైతే పరిస్దితులు ఎలా ఉంటాయో మీరే ఊహించుకోండి.. ఈ నగరంలో ఒకప్పుడు ఇక్కడ ఉండే పొడవు తోకల కోతులు పర్యాటక ఆకర్షణ. కానీ, ప్రస్తుత పరిస్దితుల్లో ఇక్కడ వాటి ఆధిపత్యం ఎక్కువైపోయిందట.. దీనికంతటికి కారణం కరోనా వైరస్.. అదేంటని ఆశ్చర్యపోకండి, కరోనా వల్ల తిండిలేక పేదలు ఎలా అలమటిస్తున్నారో ఈ కోతులు కూడా అలాగే ఇబ్బందులు పడుతున్నాయట..

 

 

ఈ వైరస్ కారణంగా పర్యాటకుల రాక ఆగిపోవడంతో వాటికి కూడా ఆహారం దొరకడం లేదు. దీంతో అవి జంక్ ఫుడ్ తింటున్నాయి. ఇలా వాటి ఆహారంలో మార్పు రావడంతో, వాటిలోనూ మార్పులొస్తున్నాయని స్థానికులు అంటున్నారు. ఇకపోతే ఈ లోప్‌బురిలోని నగరంలో సుమారుగా 6 వేల కోతులుంటాయి. అందుకని అక్కడ ఎవరూ అడుగు పెట్టే పరిస్థితి లేదు. వాటిదే ఆధిపత్యం. అంతే కాదు మరో పాత సినిమా థియేటర్ ను కూడా ఇవి ఆక్రమించాయట..

 

 

ముఖ్యంగా అందులో ఉన్న ప్రొజెక్టర్ రూమ్ ను ఆ కోతులు స్మశానంగా ఏర్పాటు చేసుకుని ఏ కోతి అయినా చనిపోతే మిగతావి ఆ కళేబరాన్ని తీసుకెళ్లి ఆ గదిలో ఉంచుతున్నాయట. అందువల్ల ఈ పాత సినిమా థియేటర్‌లోకి కూడా ఎవరినీ రానివ్వడం లేదు. ఇక ఇక్కడ కోతుల సంతానం విపరీతంగా పెరిగిపోతుండడంతో ప్రభుత్వం వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించే పనిలో పడింది.. మరి వాటిని ఇలాగే వదిలేస్తే మనుషుల రాజ్యం పోయి వానరాజ్యం రావడం ఖాయం..

 

మరింత సమాచారం తెలుసుకోండి: