కరోనా వైరస్ వల్ల దేశంలో అన్ని రంగాలు వెనకబడిపోయాయి. దేశంలో రోజురోజు కు కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా వ్యాప్తి వల్ల చాలా  కంపెనీలు , వ్యాపార సంస్థలు వర్క్ ఫ్రొం హోమ్ పద్దతిలో మెల్లమెల్లగా కార్యాకలాపాలు సాగిస్తున్నాయి. అయితే మరి చాలా రోజులుగా విద్యా సంస్థలు మూతపడే ఉన్నాయి. లక్షల సంఖ్యలో విద్యార్థులు ఇళ్లకె పరిమితం అయిపోయారు. వారికి ఈ మధ్యనే ఆన్లైన్ క్లాస్ లు ద్వారా విద్య బోధన చేస్తున్నారు. ఆంద్రప్రదేశ్ లో కరోనా దృష్ట్యా ఇప్పటికే పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసింది ప్రభుత్వం. అయితే ఆన్లైన్ క్లాస్ లు ద్వారానే ఈ ఏడాది విద్యా బోధనలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ఆగస్టు 3 నుంచి మే రెండో వారం వరకూ అకడమిక్ ఇయర్ ఉండేలా సమాలోచనలు చేస్తున్నారు.

 

 

 

దీంతో మొత్తం 180 వర్కింగ్ డేస్ ఉండనున్నాయి. దాదాపు 30 శాతం పాఠ్యాంశాల తగ్గింపునకు నిర్ణయం తీసుకోవడంతో వర్కింగ్ డేస్ తగ్గినా విద్యార్థులపై ఒత్తిడి ఉండదని భావిస్తున్నారు. ఇక ఈ ఏడాది పండగ సెలవులు కూడా తగ్గించనున్నారు. ఎగ్జామ్స్ షెడ్యూల్ మారనుంది. స్కూల్స్ వర్క్ చేసే 180 రోజుల్లో పరిస్థితులు కుదుటపడేదాకా ... దూరదర్శన్ , ఆన్లైన్ , మన టీవీ ద్వారా పాఠాలు ప్రసారం చేయనున్నారు. పరిస్థితులు అనుకూలించి కరీనా ప్రభావం తగ్గితే తరువాత క్లాస్ లను ఎప్పటి మాదిరిగా నిర్వహించడానికి చూస్తున్నారు.  ఇక టెన్ ఎగ్జామ్స్ మార్చి నుంచి ఏప్రిల్కు మార్పు చేసి మే తొలి వారంలో 6 నుంచి 9 తరగతుల వారికి ఎగ్జామ్స్ నిర్వహించేలా కేలండర్ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సప్తగిరి ఛానల్ ద్వారా 1 నుంచి 5 తరగతులకు బ్రిడ్జి కోర్సు  6 నుంచి 10 స్టూటెంట్స్ కు పాఠాలు చెబుతున్న విషయం తెలిసిందే.

 

 

ఈ విధానాన్ని కొనసాగించడంతో పాటు అదనంగా మన టీవీ ద్వారానూ పాఠాలు ప్రసారం చేయాలని ఆలోచిస్తుంది ప్రభుత్వం. అయితే ఈ ఏడాదికి మాత్రమే ఇలా నిర్వహించి వచ్చే ఏడాది నుంచి యధావిధి గా తరగతులు షెడ్యూల్ ఉంటుందని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: