ప్రపంచానికి వినోదాన్ని పంచిన వినోద భరితపు యాప్ టిక్ టాక్.. ఈ యాప్ చైనా నుంచి వచ్చిన దీని వల్ల చాలా మంది సెలెబ్రెటీలు గా ఫీల్ అవుతున్నారు. అలాంటి యాప్ వల్ల యువత కొత్త కొత్త స్టంట్ లు చేస్తూ  ఫేమస్ అవుతున్నారు. అలాంటి యాప్ కు భారత ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.చైనా ప్రభుత్వం పరిచయం చేసిన 59 యాప్ లను ప్రభుత్వం నిషేధించింది. 

 

 

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన టిక్‌ టాక్‌కు భారత్‌లో మరో ఎదురుదెబ్బ తగిలింది. టిక్ టాక్ ‌కు మద్దతు గా తాను కోర్టు లో వాదించబోనని దిగ్గజ న్యాయవాది తిరస్కరించారు. ఈ మేరకు భారత మాజీ అటర్నీ జనరల్‌ ముకుల్ రోహద్గీ స్పష్టం చేశారు. భారత ప్రభుత్వాని కి వ్యతిరేకంగా చైనా యాప్‌ తరపున తాను వాదించబోనని తేల్చి చెప్పారు. దేశానికి మద్దతు పలుకుతూ చైనా యాప్స్ కోసం వాదించేందుకు భారత్‌లో ఏ న్యాయవాది ముందుకు వచ్చే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

 

 


గత నెల 15న భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యం లో భారత ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకోవడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఘర్షణ లో భారత జవాన్లు 20 మంది అమరులైన సంగతి తెలిసిందే.
భారత ప్రభుత్వం తమ యాప్‌ను దేశ వ్యాప్తం గా నిషేధించడం పై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు టిక్‌ టాక్‌ సంస్థ ప్రయత్నిస్తోంది. ఇందు లో భాగంగా మాజీ అటర్నీ జనరల్‌ ముకుల్ రోహద్గీని తమ సంస్థ తరపున వాదించేందుకు నియమించుకుంది. అయితే, తాజాగా టిక్‌ టాక్‌ ఆఫర్‌ను ముకుల్ రోహద్గీ తిరస్కరించారు.ఇకమీదట టిక్ టాక్ యాప్ కూడా ప్లే స్టోర్ లో కనపడకుండా నిర్ణయం తీసుకుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: