ఈ  మద్య ఎనుగులకు ఎన్ని కష్టాలు వచ్చాయో.. కేరళాలో జరిగిన ఉదంతం దేశాన్ని మొత్తం కుదిపేసింది. గర్భంతో ఉన్న ఏనుగు ఆకలి తీర్చుకోవాలని బాంబుతో అమర్చిన కాలిఫ్లవర్ తినడంతో అది నోట్లో పేలిపోయి.. పద్నాలు రోజులు అవస్థలు పడి చనిపోయింది.  ఆ తర్వాత పలు ఏనుగులు వివిధ ప్రదేశాల్లో మృత్యువాత పడ్డాయి.  వేటగాళ్లు ఈ మద్య బాగా రెచ్చిపోతున్నారు.. ఏనుగు దంతాల కోసం వాటిని కృరంగా హతమార్చుతున్నారు.  మరికొంత మంది తమ పంట పొలాలను రక్షించుకునేందుకు బాంబులు అమర్చి వాటిని అంతమొందిస్తున్నారు.  తాజాగా 350 ఏనుగులు ఊహించని రీతిలో మృత్యువాతపడ్డాయి. 

IHG
 అక్కడ ఎక్కడ చూసినా గజరాజుల కలేభరాలే దర్శనమిస్తున్నాయి. ఈ మహా విషాద ఘటన దక్షిణాఫ్రికాలోని బొస్ట్వానాలో చోటు చేసుకుంది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఈ విలయం జరిగినట్టుగా అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే వీటిని దంతాల కోసం వేటగాళ్లు వేటాడారా అంటే వాటి దంతాలు సురక్షితంగానే ఉన్నాయి. మరి ఇవి ఎందుకు ఇలా మరణించాయో అన్నది మిస్టరీగా మిగిలిపోయింది. యూకెకు చెందిన ఛారిటీ నేషనల్ పార్కు రెస్క్యూకు చెందిన డాక్టర్ నియాల్ మక్కాన్ మే నెలలో ఒవావాంగో డెల్టా ప్రాంతంలో విమానంలో ప్రయాణిస్తూ 169 ఏనుగు మృతదేహాలను గుర్తించారు.

IHG

అప్పటికే చాలా ఏనుగులు అచేతనంగా ఉన్నాయని గమనించి వెంటనే దక్షిణాఫ్రికా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం సర్వే చేపట్టింది. ఒక్క బొస్ట్వానా ప్రాంతంలో 350కి పైగా ఏనుగు కళేబరాలు కనిపించాయి. వరుసగా ఏనుగులు మాత్రమే చనిపోవడం ఏంటని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇన్ని ఏనుగులు ఒకేసారి మరణించడం అనేది ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదని ఫారెస్ట్ ఆఫీసర్లు అంటున్నారు. విష పదార్థాలు కలిసి నీరు తాగినా కూడా మిగితా జంతువులు చనిపోయిన ఆనవాళ్లు కూడా ఉండాలి. కానీ అది కూడా జరగలేదు. వాటి నుంచి నమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపించారు. ఆ రిపోర్ట్ వస్తే కానీ ఏం జరిగింది అనేది చెప్పలేమని అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: