టిక్‌టాక్‌తో పాటు 59 చైనీస్ యాప్‌లను భారత ప్రభుత్వం సోమవారం నాడు బ్యాన్ చేసింది. గత నెల 15-16 తారీకులలో తూర్పు లద్దాఖ్‌‌లోని గాల్వన్‌ లోయలో భారత్‌-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక కమాండింగ్‌ అధికారి తో పాటు 20 మంది భారత జవాన్లు వీరమరణం చెందారు. ఇంకో 17 మంది భారత జవాన్లు తీవ్రంగా గాయాలపాలయ్యారు. దీంతో ఇండియాలో చైనీయుల కుటిల బుద్ధి పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. చైనీస్ వస్తువులను, యాప్స్ లని బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేయడం కూడా భారతదేశ వ్యాప్తంగా పెరిగిపోయింది. కేంద్ర మంత్రులు కూడా టిక్‌టాక్‌ యాప్ ని బ్యాన్ చేస్తామంటూ చెప్పుకొచ్చారు.


59 చైనీస్ యాప్‌లను బ్యాన్ చేస్తున్నామని భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రపంచంలోనే కాకుండా, చైనా దేశంలో కూడా పెద్ద సంచలనం అయ్యింది. చైనా ప్రభుత్వ మీడియా ది గ్లోబల్ టైమ్స్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం... టిక్‌టాక్, హెలో యాప్‌లను ప్రైవసీ, రక్షణ నిమిత్తం భారత ప్రభుత్వం బ్యాన్ చేయాలని తీసుకున్న నిర్ణయం కారణంగా మాతృ సంస్థ బైట్‌డాన్స్ 6 బిలియన్ డాలర్ల (రూ. 45 వేల కోట్లు) నష్టపోవచ్చని ఒక అంచనా వేసిందని తెలుస్తోంది.


మొబైల్ యాప్ ఎనాలిసిస్ సంస్థ అయిన సెన్సార్ ట్వూర్ ప్రకారం మే నెలలో టిక్‌టాక్ యాప్ ని 112 మిలియన్ సార్లు డౌన్‌లోడ్ చేయబడింది. ఐతే వాటిలో యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన వ్యక్తులలో భారతీయులే చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అమెరికా దేశస్తులకంటే ఎక్కువ మంది మన భారతదేశంలోనే టిక్‌టాక్ డౌన్‌లోడ్ చేసారు.


టిక్‌టాక్, షేర్‌ఇట్, యుసి బ్రౌజర్, బైడు మ్యాప్, హెలో, మి కమ్యూనిటీ, క్లబ్ ఫ్యాక్టరీ, వీచాట్, యుసి న్యూస్‌లతో సహా చైనా దేశానికి చెందిన 59 యాప్‌లను భారత ప్రభుత్వం సోమవారం నిషేధించింది.  భారతదేశం యొక్క సార్వభౌమాధికారం,  సమగ్రత, భారతదేశం యొక్క రక్షణ, రాష్ట్ర భద్రత దృష్టిలో ఉంచుకొని చైనా సంస్థ యాప్లను బ్యాన్ చేసినట్టు భారతదేశం సమర్ధత ఇచ్చుకుంది.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: