దేశంలో కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి.  ప్రజలు గతంలో ఉన్న పరిస్థితిలు లేవు. ముఖ్యంగా ఉద్యోగస్తుల విషయంలో వారికి చెల్లించే జీతి భత్యాల విషయాల్లో పలు రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. గత నెల వరకు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులకు సగం జీతాలు చెల్లించిన విషయం తెలిసిందే. కరోనా కష్ట సమయంలో ఆర్థిక వనరులు ఎక్కడ నుంచి లేకపోవడంతో ఇలా తప్పని సరిపరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందని ముఖ్యమంత్రులు అన్న విషయం తెలిసిందే. ఈ మద్య లాక్ డౌన్ సడలించిన విషయం తెలిసిందే. దాంతో దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడం మొదలయ్యాయి. ఇక మళ్లీ లాక్ డౌన్ చేస్తారా అన్న సందేహాలు కూడా మొదలయ్యాయి. కానీ ఇప్పటిట్లో లాక్ డౌన్ ఏమీ ఉండదని చెబుతున్నవిషయం తెలిసిందే. తాజాగా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి నిధులు అందలేదని మహారాష్ట్ర మంత్రి విజయ్ వడెట్టివార్ తెలిపారు.

 

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే నెల జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉందని, జీతాలు చెల్లించాలంటే అప్పు చేయక తప్పదని ఆయన చెప్పారు.   గురువారంనాడు మీడియాతో మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులూ తమకు రాలేదని స్పష్టం చేశారు. నిధులు వచ్చినట్టు ఎవరైనా నేతలు చెబుతుంటే అది రాష్ట్రాన్ని వంచించడమే అవుతుందని అన్నారు.  మూడు నాలుగు డిపార్ట్‌మెంట్లు మినహా ఇతర శాఖల ఖర్చుల్లో కోత విధించామని వెల్లడించారు.   విద్యార్థుల ఫెలోషిప్ కోసం అమలు చేస్తున్న సారథి స్కీమ్ కొనసాగుతుందని, స్కీమ్‌ కింద ఈ ఏడాది రూ.50 కోట్లు కేటాయించామని మంత్రి చెప్పారు.  

 

స్కీమ్ కొనసాగుతుందని మరోసారి మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై మాట్లాడుతూ, పుణె జిల్లాలో 400 కంటైన్‌మెంట్ జోన్లు, ముంబైలో 700కు పైగా కంటైన్మెంట్ జోన్లు ఉన్నట్టు చెప్పారు.  స్కీమ్ మూసేసారని, ఈ ఏడాది ఫెలోషిప్ రాదని కొందరు రాజకీయ లబ్ధి కోసం ప్రచారం చేస్తున్నారని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. స్కీమ్ కొనసాగుతుందని మరోసారి మంత్రి స్పష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: