ఈ కరోనా కాలంలో కేవలం డాక్టర్లు, పోలీసులు, విద్యుత్, పారిశుధ్య కార్మికులే మాత్రమే కాకుండా డెలివరీ బాయ్స్ కూడా వారి ప్రాణాలకు తెగించి డెలివరీ లు చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో ప్రజల ఆకలి తీర్చేందుకు వారు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ పిజ్జా డెలివరీ బాయ్ కు కొంతమంది మర్చిపోలేని అనుభవాన్ని అందించారు. ఇంగ్లాండులో బాబ్ అనే వ్యక్తి పిజ్జా డెలివరీ చేయడానికి ఓ ఇంటికి వెళ్లగా అక్కడ ఉన్న ఇద్దరు అమ్మాయిలతో పాటు అబ్బాయి అతడిని వారి వంటగదిలోకి ఆహ్వానించారు.

 

 

అయితే అక్కడ వారు మేము డబ్బులు చేతికి ఇవ్వమని, మీరు కప్ గేమ్ ఆడి కావాల్సినంతా గెలుచుకోవచ్చు అని అతనికి తెలపగా అతడు ఆ ఆట ఆడాడు. ఇక ఆట ఏంటంటే ఓ బల్లపై 12 కప్పులు పేర్చబడి ఉంటాయి. ఇక అందులో ఏమైనా ఆరు కప్పులను ఎంపిక చేసుకొని వాటి కింద ఎంత డబ్బు ఉంటే అంత డెలివరీ బాయ్ కి సొంతం చేసుకోవచ్చు. దీంతో అతను ఆటడగా మొదటగా తాను ఎంచుకున్న ఆరు కప్పులలో ఒక కప్పుని తీసి చూడగా మొదటి దానిలో ఇరవై డాలర్లు ఉండగా, రెండో కప్పు కింద ఐదు డాలర్ల నోటు కనబడ్డాయి.

 

 

అయితే అలా మునుముందుకు మరికొన్ని కప్పులు తీసేసరికి అతనికి రావలసిన బిల్లులు మొత్తం వచ్చేగా అతను మరో ప్రయత్నంలో $100 ఉన్న కప్ తీయడంతో అక్కడున్న వారు అందరూ ఎగిరి గంతేశారు. ఇక అంతే అంతటితో తాను ఊహించని సప్రైజ్ తో అతనికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అక్కడ డబ్బులు తీసుకొని వారందరికి కృతజ్ఞతలు తెలుపుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు డెలివరీ బాయ్. అయితే 11 సంవత్సరాలు అదే వృత్తిలో కొనసాగుతున్న డెలివరీ వ్యక్తిని మరింత సంతోషపెట్టేందుకు మిగతా కప్పుల కింద ఉన్న మొత్తం డబ్బులు తీసి అతని చేతికి ఇవ్వడంతో ఆనందంతో నిజంగా కంటతడి పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: