టెక్నాలజీ అనేది మంచి కోసం కనిపిడితే, మరికొందరు దానిని ప్రవృత్తిగా మార్చుకొని అడ్డదారులు తొక్కుతున్నారు. టెక్నాలజీతో ఒకవైపు సౌకర్యాలు పెరిగాయని అనుకున్న మరోవైపు మోసాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. కాకపోతే చిత్తూరు జిల్లాలో కొంత మంది యువకులు ఓ ముఠాగా ఏర్పడి డింగ్ టోన్ యాప్ ద్వారా వ్యాపారస్తులను బురిడీ కొట్టించారు. నిజానికి గూగుల్ ప్లే స్టోర్ లో ఈ యాప్ ఉచితంగా లభిస్తుంది. దీని ద్వారా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు, అలాగే మెసేజ్లు కూడా పంపించుకోవచ్చు. 

How to earn unlimited credits in dingtone app. - YouTube

అయితే ఇక్కడే వీరు దాని ద్వారా వస్తువులు కొనుగోలు అలాగే వారి సరదాలను తీర్చుకున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లి మండలానికి చెందిన అఖిల్, పృద్వి, భరత్ కుమార్, హరీష్, అజయ్ కుమార్, సాయిచరణ్, వికాస్, చిన్నారెడ్డి, చిరంజీవి లతోపాటు మరొక యువతి అందరూ కలిసి ఓ బృందంగా ఏర్పడి డింగ్ టోన్ డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే ఆ తర్వాత వారి జల్సాల కోసం మదనపల్లెలోని ఆరుగురు వ్యాపారుల నుంచి సెల్ ఫోన్ లు, బట్టలు, బేకరీ నుండి ఫుడ్ ఐటమ్స్ ను కొనుగోలు చేశారు. అయితే వారికి చెల్లించవలసిన డబ్బులకు ఫోన్ పే ద్వారా డబ్బు వేసినట్లు డింగ్ టోన్ యాప్ ద్వారా వారికి నకిలీ మెసేజ్లను వ్యాపారుల సెల్ ఫోన్స్ కు పంపించడం జరిగింది.

 

 

వారు పంపించినప్పుడు డబ్బు పడినట్లు మెసేజ్ కనిపిస్తుంది కానీ, ఖాతాలో చూసుకుంటే వారు పంపించిన డబ్బులు జమ అయి ఉండవు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెల్ ఫోన్ నెంబర్ల ఆధారంగా వారిని కనిపెట్టి మంగళవారంనాడు అరెస్ట్ చేశారు. ఇక వారి నుండి మొత్తం ఎనిమిది సెల్ ఫోన్, బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ప్రబుద్ధులు కేవలం డింగ్ టోన్ యాప్ ద్వారా మాత్రమే కాకుండా ఫేస్బుక్ ద్వారా కూడా మోసాలకు పాల్పడినట్టు డి.ఎస్.పి తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: