కర్ణాటక రాష్ట్రంలో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ హెల్త్ బులిటెన్ ను మీడియా పూర్వకంగా విడుదల చేసింది. ఇక ఇందులో నేడు గడచిన 24 గంటల్లో ఏకంగా 1502 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 18016 కు చేరుకుంది. ఇక మరోవైపు నేడు ఒక రోజు రాష్ట్ర వ్యాప్తంగా 271 మంది కరోనా వైరస్ నుంచి బయటపడి హాస్పిటల్ నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నేటి వరకు 8334 కేసులు డిశ్చార్జ్ అయ్యారు.

 

 

ఇక మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం 9406 కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి. ఇక ఇందులో 166 మందికి వారి ఆరోగ్యం క్షీణించడంతో వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఇక నేడు ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా 19 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారినపడి మృతి చెందినవారి సంఖ్య 272 కు చేరుకుంది. ఇక కేవలం బెంగళూరు మహా నగరం లోనే 889 కేసులు భారీగా నమోదయ్యాయి. దీనితో బెంగళూరు మహా నగరంలోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్ణాటకలో ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా చివరికి కరోనా వైరస్ ఉధృత రూపం దాలుస్తుంది నానాటికి.

మరింత సమాచారం తెలుసుకోండి: