ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం చంద్రబాబు హయాంలో ఏకంగా అమరావతి ప్రాంతంలో 30 వేల ఎకరాలకు పైగా సేకరించడం దేశ చరిత్రలోనే చరిత్ర సృష్టించింది. వివాదరహితంగా జరిగిన భూసేకరణ రాష్ట్రంలోని మరియు దేశంలోని పెద్ద హాట్ టాపిక్ అయింది. చంద్రబాబు మాత్రం అమరావతి నగరం ప్రపంచ చరిత్రలో చిరస్థాయి నగరంగా మిగిలిపోతుందని తెలపడం జరిగింది. ఎంతో మంది రైతుల దగ్గర మరియు దళితుల దగ్గర అసైన్డ్ భూములను చంద్రబాబు మరియు ఆయన బినామీలు లాక్కున్నారని మరోవైపు అప్పట్లో ఉన్న ప్రతిపక్షాలు ఆరోపించడం జరిగింది. చంద్రబాబు హయాంలో అమరావతి ప్రాంతంలో పనులు చాలావరకు వేగవంతంగా జరిగాయి. కానీ ఎప్పుడైతే జగన్ అధికారంలోకి రావడం జరిగింది 3 రాజధానుల నిర్ణయం ప్రకటించడం జరిగిందో అమరావతిలో పనులు చాలావరకు నిలిచిపోయాయి.

 

 అమరావతి మాత్రమే రాజధానిగా గుర్తించాలని ఆ ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులు మరియు ఆ ప్రాంత ప్రజలు ఆందోళనలు నిరసన దీక్షలు చేపట్టడం స్టార్ట్ అయింది. వాళ్ల దీక్ష మరియు పోరాటం 200 రోజులకు చేరుకుంది. ప్రభుత్వం నుండి గాని ఇతర ప్రాంత ప్రజల నుండి గాని ఎలాంటి సపోర్ట్ రావడం లేదు. ఇటువంటి నేపథ్యంలో ఎన్నారై లో ఉన్న తెలుగు ప్రజలు అమరావతిలో దీక్షలు నిరసనలు చేపడుతున్న వారికి సపోర్ట్ గా నిలవటానికి రెడీ అయ్యారు.

 

అమరావతి లో రైతులు మరియు భూములు ఇచ్చిన వారు చేస్తున్న దీక్ష 200 రోజులు పూర్తి కావడం తో అమెరికాలోని 200 నగరాల నుంచి జూమ్ కాల్ ద్వారా జులై 3 రాత్రి 9 గంటలకు క్యాండిల్ లైట్ నిరసన (వెలుగు పూల సంఘీభావం) తెలుపుదాం అని ఇచ్చిన పిలుపు 300 నగరాలకు చేరింది. ఎన్నారై లో చాలా మంది ప్రజలు ఈ క్యాండిల్ ర్యాలీ పాల్గొనటానికి రెడీ అయ్యారు. ఇతర దేశాలలో ఉన్న ప్రజలు వృద్ధులు పిల్లలు అన్ని ప్రాంతాలకు చెందిన తెలుగువారు nri వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. సపోర్ట్ బాగానే ఉన్నా గాని రియాల్టీ లో రాష్ట్ర ప్రభుత్వంలో గానీ రాష్ట్ర  ప్రజలలో గాని వర్క్ అవ్వడం కష్టమని మేధావులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: