టిక్ టాక్ యాప్.. ఇప్పుడు బ్యాన్ అయ్యి భారత్ కు సగం దరిద్రం వదిలింది కానీ.. లేకుంటే ఈ టిక్ టాక్ వల్ల ఎన్ని ప్రమాదాలు.. ఎన్ని దారుణాలు జరిగేవో. ఇప్పటికే ఈ టిక్ టాక్ పిచ్చితో ఎందరో యువకులు ప్రాణాలు తీసుకున్నారు. టిక్ టాక్ మాయలో ఉన్నారు అంటే పక్కన ఎవరు ఉన్నారు? ఏం చేస్తున్నారు.. మనం ఏం చేస్తున్నాం అనేది కూడా గుర్తుండదు. 

 

ఇంకా అలానే వింతలు చెయ్యాలని కొందరు కాళ్ళు, చేతులు విరగొట్టుకుంటే మరికొందరు ఏకంగా ప్రాణాలను పోగొట్టుకున్నారు.. మరికొందరు పిచ్చి పిచ్చి వీడియోల కారణంగా జైలుకు వెళ్లారు. ఇంకా ఈ టిక్ టాక్ గత సంవత్సరమే బ్యాన్ అయినప్పటికీ మళ్లీ వచ్చింది. ఇంకా ఇప్పుడు చైనా యాప్స్ అన్ని బ్యాన్ చెయ్యాలి అని టిక్ టాక్ ని బ్యాన్ చేసారు. ఇది అంత పక్కన పెడితే టిక్ టాక్ లో ఓ వీడియో కారణంగా ఓ యువకుడు అరెస్ట్ అయ్యాడు. 

 

ఆ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా ? అదేనండి.. గుజారాత్‌లోని రాజ్‌కోట్‌లో ఇద్దరు వ్యక్తులు టిక్ టాక్ పిచ్చితో కళ్లు మూసుకుపోయి గుడిలోకి నంది విగ్రహాన్ని తన్నుతూ వీడియో తీశారు. జయేష్ చుదాస్మా, దినేష్ మహిందా అనే ఇద్దరు యువకులు ఓ గుడిలోకి వెళ్లి టిక్ టాక్ వీడియో షూట్ చేశారు. అది సాధారణంగా ఉంటే ఇంత సమస్య వచ్చేది కాదు. 

 

కానీ వాళ్ళు ఆ గుడిలోనే జయేష్ నంది విగ్రహాన్ని బలంగా తన్నాడు. దీంతో ఆ విగ్రహం ధ్వంసమైంది. ఇంకా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. వాట్సాప్ లో వైరల్‌గా మారింది. దీంతో స్థానికులు ఆ యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.  జయేష్, దినేష్‌లను పోలీసులు నిన్న అరెస్టు చేశారు. 

 

అయితే ఈ వీడియో టిక్ ‌టాక్ యాప్‌ను బ్యాన్ చేయడానికి కొద్ది రోజులు ముందు షూట్ చేసినట్లు నిందితులు తెలిపారు. తప్పును తెలుసుకున్నామని, క్షమించాలని కోరారు. ఏది ఏమైనా ఈ టిక్ టాక్ వల్ల ఎన్నో సమస్యలు తగ్గాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: