కరోనా మహమ్మారి భయం జనాల్లో ఎంత పెరిగిపోతోంది. అంతే స్థాయిలో కేసుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో ప్రజలకు, ప్రభుత్వానికి కూడా ఆందోళన తీవ్రం అయ్యింది. ముఖ్యంగా తెలంగాణలో మొదట్లో కాస్త అదుపులో ఉన్నట్టు గా కనిపించినా , అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. తెలంగాణలో ప్రతిరోజు నమోదయ్యే కేసుల్లో 90 శాతం వరకు హైదరాబాద్ మహానగరంలో ఉండటంతో, హైదరాబాద్ పేరు చెబితే ఇప్పుడు బెంబేలెత్తిపోయే పరిస్థితి నెలకొంది. ఇక్కడి కేసుల సంఖ్య 50 వేలకు పైగా చేరుకుంటాయని నిపుణులు సూచిస్తుండడంతో  మరింతగా ఆందోళన పెరిగిపోతుంది.

 

ఇప్పటికే హైదరాబాదులో కేసుల సంఖ్య ఎక్కువగా పెరుగుతుందని, కేంద్ర బృందం కూడా అధ్యయనం చేసిన తర్వాత, ఇక్కడ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నాయని, ఎక్కువ మంది ఈ నగరంలోనే ఉపాధి కోసం వస్తుండడంతో, ఈ వైరస్ మరింతగా పెరిగిపోయిందని, ఇక మరణాలు కూడా హైదరాబాదులోనే ఎక్కువగా సంబవిస్తుండడం ఆందోళన కలిగించే అంశమని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. వారు వీరు అని బేధం లేకుండా, మంత్రుల నుంచి ఐపీఎస్, ఐఏఎస్ వరకు అందరూ దీని ప్రభావానికి గురవుతున్నారు.

 

ముఖ్యంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇప్పుడు రద్దీ  బాగా పెరిగిపోతుంది . పేషెంట్ల కు తగినంత స్థాయిలో బెడ్లు కూడా లేకపోవడం ఆందోళన కలిగించే అంశమే. కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ ఆస్పత్రిలో చేర్చుకోకుండా హోమ్ క్వారంటైన్ కు సిఫార్సు చేస్తున్నారు.ఇది  ఇలా  ఉంటే హైదరాబాదులోని సుమారు 1500 పడకలు  మాత్రమే ఉన్నాయి. 400 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు పేషెంట్ల తో నిండిపోయాయి. దీంతో ప్రభుత్వ ఆస్పత్రిల కొత్త కేసులు చేర్చుకునే పరిస్థితి లేదు. ప్రస్తుత హైదరాబాద్ పరిస్థితి చూస్తుంటే ఆందోళన కలిగిస్తోంది.ఈ కరోనా విలయం ఎప్పటికి పోతుందో తెలియడం లేదు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించడం తప్ప, ప్రభుత్వం చేసేదేమీలేదని తేల్చడంతో,  ప్రజల్లో మరింత ఆందోళన నెలకొంది .ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాదీలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: