భారత్ చైనా సరిహద్దు లో తలెత్తిన వివాదం ఎక్కడ వరకు దారితీస్తుంది అన్నది ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో కూడా ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది. భారత భూభాగంలోకి చొరబడి కొంత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు చైనా ప్రయత్నిస్తూ ఉంటే భారత్ మాత్రం వెనకడుగు వేయకుండా చైనాకు బుద్ధి చెబుతుంది. సరిహద్దు ల్లో తలెత్తిన వివాదం రోజు రోజుకు ముదురుతు తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల కు దారితీసింది. ఇప్పటికే చైనా భారత్ పై అధికారు ల మధ్య పలుమార్లు చర్చలు జరిపినప్పటి కీ ఎక్కడ శాంతియుతంగా మాత్రం ఈ వివాదం సద్దుమణిగే లా  కనిపించడం లేదు.. 

 

 యుద్ధం జరగడం ఖాయం అనే విధంగానే ఉంది ప్రస్తుతం చైనా భారత్ సరిహద్దులో ఉన్నది  పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు ఇరుదేశాల  సైన్యాధికారులు పైపైన శాంతియుతంగా వివాదాన్ని సద్దుమణిగేలా చేసుకుందామని చర్చలు జరుపుతున్నారు... కానీ వెనుకనుంచి మాత్రం చైనా భారత సరిహద్దుల్లో పూర్తిగా సైన్యాన్ని భారీ మొత్తంలో మోహరించడం ఎంతో శక్తివంతమైన ఆయుధాలని సరిహద్దుల్లోకి తరలించడం లాంటివి చేస్తున్నారు. ప్రస్తుతం అటు చైనా ఇటు భారత్ కూడా ఇలాంటిదే చేస్తోంది. ఇప్పటికే ఇరు దేశాల సైన్యాలు సరిహద్దుల్లో భారీ మొత్తంలో మోహరించాయి అని చెప్పాలి. 

 


 ఇక భారత్ కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చైనాతో యుద్ధానికి సిద్ధమైపోతుంది.తాజాగా  చైనా సరిహద్దుల్లో పెట్రోల్ రేజల్స్  928 బి నీ అక్కడికి మొహరించింది. దీంతో వెంటనే భారత్ హై పవర్డ్ పెట్రో  స్టీల్ గోట్ ని రంగంలోకి దింపింది. భారత్-చైనా సరిహద్దు ఉన్న ప్రతి చోట నువ్వానేనా అన్నట్టుగా ప్రస్తుతం రెండు దేశాల మధ్య పరిస్థితులు నెలకొన్నాయి. వాళ్లు ఎలాంటి శక్తివంతమైన ఆయుధాలు తీసుకొస్తే అంతకుమించిన శక్తివంతమైన ఆయుధాలను భారత సైన్యం కూడా సరిహద్దుల్లోకి వ్యవహరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: