ప్రస్తుతం చైనా  భారత సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. భారత భూభాగంలో ఉన్న గాల్వన్ లోయను ఆక్రమించుకోవాలని చైనా ప్రయత్నిస్తూ ఉంటే చైనా కు  సరిగ్గా సమాధానం చెప్తు  ఎక్కడ వెనకడుగు వేయడం లేదు భారత్ . ఈ నేపథ్యంలో చైనా భారత సరిహద్దుల్లో వాతావరణం మరింత ముదురుతోంది. ఓవైపు  శాంతియుతంగా చర్చలు జరుపుకుందామని పైపైన చెబుతూనే లోలోపల మాత్రం ఇరుదేశాల సైనిక సరిహద్దుల్లో భారీగా సైన్యాలను మోహరించడం తో పాటు ఆయుధాలను కూడా తెచ్చి  పెడుతున్నారు. 

 

 అయితే భారత్-చైనా పై యుద్ధానికి సిద్ధం అనే విధంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే గతంలో ఉగ్రవాదులు స్థావరాలను  మట్టుబెట్టేందుకు సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది భారత్ . ప్రస్తుతం చైనా పై కూడా భారత్ సర్జికల్ నిర్వహిస్తోంది. అయితే ఈసారి చైనాపై ఆర్థికంగా సర్జికల్ స్ట్రైక్ చేసింది భారత్. ప్రస్తుతం చైనా భవిష్యత్ వ్యూహాలు అన్నింటిని అతలాకుతలం చేస్తోంది భారత్. ఈ క్రమంలోనే భారత్లో చైనా కు సంబంధించిన ఎక్కువ మంది వినియోగదారులు లో ఉన్న యాప్లను భారత్ నిషేధించింది అని విశ్లేషకులు చెబుతున్నారు. 

 

 ఒక్కసారిగా 59 యాప్ లను  భారత్లో నిషేధించడంతో చైనా కు  భారీ నష్టాలు వస్తున్నాయి. కేవలం యాప్ ని కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఉన్న చైనా కాంట్రాక్టులు కూడా పూర్తిగా రద్దు అయిపోతుంది. మొన్నటికి మొన్న రైల్వే కు సంబంధించిన ఎటువంటి కాంట్రాక్టు రద్దు అవ్వగా... దేశవ్యాప్తంగా రోడ్డు నిర్మాణ పనుllo2 చైనా కంపెనీలను అనుమతించబోమని కేంద్రం స్పష్టం చేసింది. ఇక ఇటీవల బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా గతంలో చైనాకు ఇచ్చినటువంటి ఒక కాంట్రాక్టు రద్దు చేసుకున్నారు. ఇలా అన్ని ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు పూర్తిగా చైనాను నిషేధం చేస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. తద్వారా భారత్ సర్జికల్ స్ట్రైక్ అని  చేస్తుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: