ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దు లో పరిస్థితి రోజు రోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం చైనా పై అన్ని రకాలుగా యుద్ధం చేస్తుంది  భారత్. చైనా  సైనికులు మూకుమ్మడిగా భారత సైన్యంపై దాడి చేయడం... ఈ దాడిలో ఏకంగా భారత సైన్యానికి చెందిన కొంతమంది సైనికులు అమరులవ్వటం  దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ చైనా కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చైనాకు బుద్ధి చెప్పడానికి అన్ని సన్నాహాలు చేసుకుంటోంది భారత్

 

 ఓ వైపు శాంతియుతంగా సామరస్యంగా వివాదాన్ని సద్దుమణిగేలా చేసుకుందామని  చర్చలు జరుపుతూనే మరోవైపు చైనా దుందుడుకు చర్యలకు గట్టి జవాబు ఇచ్చేందుకు అంతా సిద్ధం చేసుకుంటుంది భారత సైన్యం . ఇప్పటికే భారత ఆర్మీ కి అన్ని అధికారాలు ఇచ్చి సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. యుద్ధం జరుగుతున్న సమయంలో పై అధికారుల పర్మిషన్ కోసం  వేచి చూడకుండా కల్నల్ అధికారుల స్థాయిలో నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉంది. తద్వారా శత్రుదేశాల పై మరింత వ్యూహాత్మకంగా దాడి చేసేందుకు అవకాశం ఉంటుంది. 

 

 అయితే ఈ నేపథ్యంలో తాజాగా హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఎంతో కీలకం గా మారిపోయాయి. ప్రస్తుతం భారతదేశం రెండు యుద్ధాలను చేస్తుంది  అంటూ అమిత్ షా  తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఓ వైపు చైనా నుండి వచ్చిన కరోనా వైరస్ తో పోరాటం చేస్తునే  మరోవైపు సరిహద్దుల్లో  చైనా తో  పోరాటం చేస్తోంది అని అమిత్ షా  చేసిన వ్యాఖ్యలు పరమార్ధం అని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే ఆర్థికంగా చైనాతో యుద్ధం చేశామని ఇక ఇప్పుడు మానసికంగా చైనాతో యుద్ధం చేస్తున్నామని వ్యాఖ్యల అర్థం అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: