హైద‌రాబాద్ అంటే చార్మినార్‌, ట్యాంక్‌బండ్ ఎలా గుర్తుకు వ‌స్తాయో మూసి న‌దీ సైతం అదే రీతిలో గుర్తుకు వ‌స్తుంది. మూసీ న‌దిలో కాలుష్యం, న‌దికి ఇరువైపులా ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలు, భవన నిర్మాణ వ్యర్థాలు, మట్టి దిబ్బలు, నది మధ్యలో గుంతలు, తూముల వద్ద పూడిక...ఇలా స‌క‌ల స‌మ‌స్య‌ల‌కు మూసీ నెల‌వుగా ఉంటుంది. మురికిగా మారిన మూసీ నదిని శుద్ధి చేసి సరికొత్త అందాలను సమకూర్చేందుకుగాను పనులు మొద‌లు పెట్టారు. ఈ ప‌నుల‌తో క్రమక్రమంగా మూసీ స్వరూపమే మారుతుందని భావిస్తున్నారు. 

 

ఓఆర్‌ఆర్‌ ఈస్ట్‌ నుంచి ఓఆర్‌ఆర్‌ వెస్ట్‌ వరకు ప్రాతిపదికగా తీసుకుని బాపూఘాట్‌ నుంచి నాగోల్‌ వరకు 20 కిలోమీటర్ల మేర పరిధిలో ప్రక్షాళన పనులు కొనసాగుతున్నాయి. కబ్జాలు, డ్రైనేజీలతో మురికికూపంగా మారిన మూసీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే చర్యలు వడివడిగా కొనసాగుతున్నాయి. మూసీ నదిలో నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు చేపడుతున్నారు. నిరంతరం నీటి ప్రవాహానికి వీలుగా పేరుకుపోయిన చెత్తాచెదారం, జులీ ఫ్లోరా ట్రీస్‌లను వెనువెంటనే తొలగిస్తున్నారు. పూడికతీత పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. దోమల నిర్మూలనకు ప్రత్యేక యంత్రాలతో ఫాగింగ్‌, డ్రోన్ల ద్వారా యాంటీ లార్వా కెమికల్‌ స్ప్రే చేస్తున్నారు. ఇటీవలే సరికొత్తగా ఐవోటీ యంత్రాలను అందుబాటులోకి తెచ్చి దోమల నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. కబ్జాలకు ఆస్కారం లేకుండా మూసీ నది సరిహద్దుల గుర్తింపునకు సర్వే  ప్రారంభించారు. ఆక్రమణల తొలగింపు, కోర్టు కేసులపై ప్రత్యేకంగా దృష్టి సారించి చర్యలు తీసుకుంటున్నారు.

 


కబ్జాలకు ఆస్కారం లేకుండా మూసీ నది సరిహద్దుల గుర్తింపునకు సర్వే  ప్రారంభించారు. ఆక్రమణల తొలగింపు, కోర్టు కేసులపై ప్రత్యేకంగా దృష్టి సారించి చర్యలు తీసుకుంటున్నారు. 20 కిలోమీటర్ల మేర నది పొడవునా డ్రోన్ల సహాయంతో దోమల నియంత్రణకు యాంటీ లార్వా కెమికల్‌ స్ప్రే చేస్తున్నారు. బాపూఘాట్‌, అత్తాపూర్‌, నాగోల్‌ బ్రిడ్జిల వద్ద రెయిన్‌ గార్డెన్‌ పనులు చేపట్టేందుకు సమాయత్తమయ్యారు. నాగోల్‌ వద్ద హరితహారం కార్యక్రమంలో పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: