ఇటీవల విజయసాయిరెడ్డికి మరియు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కి మధ్య గ్యాప్ వచ్చిందని సోషల్ మీడియాలో ఉత్తరాంధ్ర ప్రాంత రాజకీయాలలో వార్తలు బలంగా వచ్చాయి. అదే సమయంలో సోషల్ మీడియాలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఓ పొలిటికల్ లీడర్ విజయసాయి రెడ్డి పై అసభ్యకరమైన పోస్టులు పెట్టడం జరిగింది. దీంతో వైయస్ జగన్…. విజయసాయిరెడ్డిని వైజాగ్ ప్రాంతం నుండి తరలించడం ఖాయమని ఇటీవల జరిగిన ఈ పరిణామాలను బట్టి చాలా మంది భావించారు. కానీ అనూహ్యంగా వైయస్ జగన్ విజయసాయి రెడ్డి పుట్టినరోజు నాడు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి పార్టీ పదవి బాధ్యతలు మొత్తం అప్పజెప్పడం తో విజయసాయిరెడ్డిని విభేదించే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్లు అయింది.

 

మొదటి నుండి వైయస్ జగన్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో చాలా వరకు పార్టీ కార్యక్రమాల విషయంలో విజయసాయిరెడ్డికి పూర్తి బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది. 2014 ఎన్నికల టైంలో పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన విజయసాయి రెడ్డి ని పూర్తిగా వైజాగ్ ప్రాంతానికి జగన్ పరిమితం చేయడం జరిగింది. జగన్ పాదయాత్ర విషయంలో గానీ ఇంకా అనేక విషయాలలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అన్ని పనులను దగ్గరుండి విజయసాయిరెడ్డి చట్ట బేట్టారు. అయితే మళ్లీ ఇటీవల పూర్తిగా ఉత్తరాంధ్ర ప్రాంత పరిధిలో ఉండే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది. 

 

మొత్తంమీద చూసుకుంటే వైయస్ జగన్ విజయసాయి రెడ్డిని పూర్తిగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి పరిమితం చేయడానికి డిసైడ్ అవ్వటం జరిగిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరో పక్క ఎక్కడో నెల్లూరు ప్రాంతానికి చెందిన విజయసాయిరెడ్డి రాజధాని గా పిలవబడే విశాఖపట్టణం లో చక్రం తిప్పడం ఆ ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులకు ఏ మాత్రం పడటం లేదని టాక్. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆగడాలను ఎప్పటికప్పుడు విజయసాయిరెడ్డి అడ్డుకుంటున్న తరుణంలో ఆయనను పార్టీ పరంగా ఈ ప్రాంతం నుండి తొలగించాలని చేసినా ప్రయత్నాలు ఫలించకపోవడంతో పైగా జగన్ పర్మినెంట్ గా విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర ప్రాంతానికే పరిమితం చేసే విధంగా నిర్ణయం తీసుకోవడంతో  సాయిరెడ్డిని వ్యతిరేకించే వారికి ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి నెలకొంది అని ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: