కరోనా కట్టడి విషయంలో ఇప్పుడు పోలికలు చర్చనీయాంశమవుతున్నాయి. కేసీఆర్ అలా చేశాడు.. జగన్ ఇలా చేశాడు అని జనం చెప్పుకుంటున్నారు. మరి ఈ కరోనా టైమ్ లో చంద్రబాబు సీఎంగా ఉండి ఉంటే ఎలా మేనేజ్ చేసేవారు.. ఈ కరోనాను ఎలా కట్టడి చేసేవారు.. ఈ ఆలోచనే వెరైటీగా ఉంది కదా. ఇప్పుటికే ఈ దిశగా జనంలో ఆలోచన మొదలైంది.

 

 

ఇక ఇప్పుడు ఓ వైసీపీ ఎమ్మెల్యే ఈ విషయంపై తన అభిప్రాయం చెప్పేవారు. ఇప్పుడు జగన్ కాకుండా చంద్రబాబు సీఎం అయి ఉంటే ఎలా ఉండేదో ఎమ్మెల్యే పార్థసారథి వ్యంగ్యంగా చెప్పారు. ఆయన ఏమంటున్నారంటే.. “ ఇప్పుడు చంద్రబాబు సీఎంగా ఉండి ఉంటే సంక్షోభాన్ని అవ‌కాశంగా మార్చుకునేవాడు. గ‌ల్లిగ‌ల్లీకి ఓ హుండీ పెట్టి నిధులు స్వాహా చేసేవారు.. అంటూ కామెంట్ చేశారు.

 

 

ఇప్పుడు అలా కాకుండా కోవిడ్‌-19 స‌మ‌యంలో పేద‌లు భోజ‌నాల‌కు ఇబ్బంది ప‌డుతున్నార‌ని గ‌మనించి, వారికి ఉచితంగా రేష‌న్ ఇస్తున్నామన్నారు వైసీపీ నేత పార్థసారథి. ప్రతి గ్రామంలో కూడా హెల్త్ సెంట‌ర్ ఏర్పాటు చేసి ఆశావ‌ర్కర్ల ద్వారా వైద్యసేవ‌లు అందిస్తున్నామ‌ని ఎమ్మెల్యే పార్థసార‌ధి పేర్కొన్నారు. అంతే కాదు.. క‌రోనా కార‌ణంగా ఎక్కడ ప్రాణాలు పోతాయోన‌న్న భ‌యంతో పిరికిపంద‌లా హైద‌రాబాద్‌లో దాక్కున్న చంద్రబాబు మా ప్రభుత్వంపై ఆరోప‌ణ‌లు చేయ‌డం సిగ్గు చేట‌ని వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసార‌ధి మండిప‌డ్డారు.

 

 

ప్రజ‌ల ఆరోగ్యంపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప‌ని చేస్తుంద‌ని, అంబులెన్స్‌ల కొనుగోలులో అక్రమాలు జ‌రిగాయ‌ని టీడీపీ నేత‌లు నిసిగ్గుగా మాట్లాడుతున్నారని పార్థసార్థి మండిప‌డ్డారు. రూ.200 కోట్లకు కొత్త అంబులెన్స్‌లు కొనుగోలు చేస్తే..రూ.300 కోట్లు అవినీతి జ‌రిగింద‌ని ఆరోప‌ణ‌లు చేయ‌డం దుర్మార్గమ‌న్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: