కరోనా అన్నిరంగాలను కుదేలు చేసింది. దీని ప్రభావం లేని రంగాలు చాలా తక్కువ. అయితే అంతకుముందు నుంచే కాస్త ఇబ్బందుల్లో ఉన్న ఆటో మొబైల్ పరిశ్రమ కరోనా దెబ్బకు బాగా డీలా పడింది. అందులోనూ.. కరోనా ప్రభావంతో దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ బాగా డీలా పడింది.

 

 

అయితే ఈ కరోనా ప్రభావం నుంచి ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇప్పుడు క్రమంగా కోలుకుంటోంది. ఇది నిజంగా శుభవార్త. ఆటో మొబైల్ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. లాక్ డౌన్ ఆంక్షలు ముగిసినప్పటి నుంచి నెమ్మది నెమ్మదిగా కొనుగోళ్లు జోరందుకున్నాయని తయారీ సంస్థలు వెల్లడిస్తున్నాయి.

 

 

ఈ విషయం ఎలా చెబుతున్నారంటే.. దేశంలో ఈ ఏడాది మే నెలతో పోల్చితే జూన్ లో కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు స్వల్పంగా పెరిగాయి. ఐతే గత ఏడాది జూన్ తో పోల్చితే ఈ ఏడాది జూన్ నెల అమ్మకాల్లో మాత్రం భారీ తేడా కనిపించింది. దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ 53.7 శాతం అమ్మకాలు కోల్పోయింది. టొయోయో 36.53 శాతం మహీంద్ర అండ్ మహీంద్ర 53 శాతం అమ్మకాలు పడిపోయాయి.

 

 

ఇక హూండాయ్ ఇండియా అమ్మకాలు సైతం పడిపోయాయి. హీరో మోటోకార్ప్ 26.88 శాతం అమ్మకాలు కోల్పోయింది. టీవీఎస్ మోటార్స్ 36 శాతం అమ్మకాల వృద్ధిని కోల్పోయింది. కరోనా నుంచి క్రమంగా కోలుకుంటున్న తరుణంలో అమ్మకాలు ఇంకా పెరుగుతాయని అంచనా వేస్తున్న సంస్థలు వాహన తయారీని పెంచుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: