ఓఎన్జీసీ ముడుపుల వ్యవహారంలో కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాబర్ట్ వాద్రా బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయుధాల వ్యాపారి సంజయ్ బండారి చుట్టూ ఇప్పుడు సిబిఐ ఉచ్చు బిగిస్తోంది. ఆయనతో పాటు సౌత్ కొరియాకు చెందిన సాంసంగ్ ఇంజనీరింగ్ కంపెనీ పైనా ,ఓ ఎన్ జి సి అధికారుల పైన బుధవారం ఎఫ్ఐఆర్ నమోదైంది. 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో గుజరాత్ లో ఓఎన్ జీసీ  ప్రాజెక్ట్ దహెజ్ ను ప్రారంభించారు. ఓఎన్జీసీ ఓ విదేశీ కన్స ర్టీయం తో  6744 కోట్ల రూపాయల ఒప్పందం చేసుకుంది. కాకపోతే ఈ ఒప్పందం వెనుక అనేక ముడుపుల వ్యవహారం నడిపినట్లు సిబిఐ ఇప్పటికే ఆధారాలు సేకరించి పెట్టుకుంది.

IHG

 

ఈ వ్యవహారంలో సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా, ఆయన అనుచరులు భారీ స్థాయిలో లంచాలు అందినట్లు, ఆ లంచాల సొమ్ములతోనే లండన్ లో కోట్లాది రూపాయలు విలువ చేసే ఆస్తులను కొనుగోలు చేసినట్లు, ఈడీ తో పాటు సిబిఐ కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టాయి. ఈ వ్యవహారంలో రాబర్డ్  వాద్రా  బినామీగా ప్రచారం జరుగుతున్నా , సంజయ్ బండారి, సాంసంగ్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ పాత్ర ఉన్నట్లు ఇప్పటికే సిబిఐ దీనిపై కేసు నమోదు చేయడంతో ,త్వరలోనే ఈ వ్యవహారంలో రాబర్ట్ వాద్రా ను కూడా సి.బి.ఐ అన్ని సాక్ష్యాధారాలతో సహా బుక్ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే రాజకీయంగాను ఈ వ్యవహారం సంచలనం సృష్టించే అవకాశం లేకపోలేదు.

 

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: