ఇటీవల జూన్ 15వ తారీఖున ఇండియా - చైనా సరిహద్దు ప్రాంతం దగ్గర గాల్వాన్ లోయ ప్రాంతంలో భారత్ ఆర్మీ కి చెందిన 20 మంది సైనికులను చైనా ఆర్మీ చంపేయడం అందరికీ తెలిసిందే. చైనా ఆర్మీ కవ్వింపు చర్యల తో భారత్ భూభాగంలో అడుగుపెట్టడంతో భారత సైనికులు దీటుగా జవాబు ఇవ్వడానికి రెడీ అయిన తరుణంలో ఇరు సైనికుల మధ్య గొడవ చోటుచేసుకోవడంతో చైనా ఆర్మీకి చెందిన వాళ్లు చనిపోవటం తో పాటు మన దేశ సైనికులు కూడా చనిపోవడంతో పెద్దఎత్తున మనదేశంలో చైనాపై వ్యతిరేకత రావడం జరిగింది. దాంతో చేయనని ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి టిక్ టాక్ తో సహా 59 యాప్స్ ని భారత్ నిషేధించింది. టిక్ టాక్ యాప్ కి బాగా అలవాటు పడిన వారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. 

 

దాదాపూ టిక్ టాక్ యాప్ ఇన్ స్టాల్ చేసుకునేవారు ఇదివరకు గతంలో రోజుకి కొన్ని కోట్ల మంది ఉండేవారు. దాంతో ఈ యాప్ ద్వారా చైనా ప్రపంచ మార్కెట్లో సుమారు 43 శాతం లాభం పొందడం జరిగింది. అంతమాత్రమే కాకుండా ప్రపంచ యాప్  రంగంలో చైనాయే రారాజు అని అంతర్జాతీయ స్థాయిలో చాలా మంది ఆర్థిక నిపుణులు చెబుతుంటారు.

 

ఇటువంటి తరుణంలో మన దేశ జనాభా ఎక్కువగా ఉండటంతో పాటు చైనా దేశానికి చెందిన యాప్ లు మన వాళ్ళు ఎక్కువగా వాడటం తో...దేశ భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం 59 యాప్ లను నిషేధించడంతో అంతర్జాతీయంగా చైనా యాప్ యాపారంలో 22% నుండి 26% దెబ్బతిన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆర్థికంగా చైనా ని కొంతమేర డ్యామేజ్ చేసినట్లేనని అదిరిపోయే స్ట్రాటజీ మోడీ సర్కార్ వేసిందని మేధావులు అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: