ఎన్నికలు జరుగుతున్న సమయంలో పార్టీల పేర్లు గురించి మరియు గుర్తుల గురించి రకరకాల గొడవలు చోటుచేసుకుంటాయి. ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వెళుతూ ఉంటాయి. ఈ విధంగానే వైయస్ జగన్ పార్టీ వైసీపీ పార్టీ మాదిరిగా ప్రజాశాంతి పార్టీ జెండా ఉండడం జరిగింది అని అదేవిధంగా ఫ్యాన్ గుర్తు మాదిరిగానే హెలికాఫ్టర్ గుర్తు కూడా ఉందని ఈసీకి ఫిర్యాదు లో మొన్న ఎలక్షన్లో వెళ్లాయి. ఆ సమస్య తర్వాత సద్దుమణిగింది. ఇప్పుడు ఇదే తరహాలో మరోసారి పార్టీ పేర్ల విషయంలో ఏడాది తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాక వైసీపీ పార్టీ పేరు గురించి ఏపీ రాజకీయాల్లో ఈ వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది. పూర్తి మేటర్ లోకి వెళ్తే వైసిపి పార్టీ పై అన్నా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ భాషా ఫిర్యాదు చేశారు.

 

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరున ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ కాగా బయట రాజకీయాలలో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గా చలామణి అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు. అంతేకాకుండా వైయస్సార్ అనే పదాన్ని వైసీపీ పార్టీ నాయకులు వాడకూడదని చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ ని మహబూబ్ భాష కోరడం జరిగింది. వైయస్సార్ పేరు మీద రిజిస్టర్ అయిన పార్టీ ఏకైక పార్టీ తనదేనని అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని మహబూబ్ బాషా అన్నారు.

 

కానీ ఏపీలో అధికారంలో ఉన్న వైకాపా పార్టీ అధికార పత్రాలపై యువజన శ్రామిక పార్టీ అని పూర్తి పేరు రాయడం లేదని, వైఎస్సార్ అనే పేరుతో తన పార్టీని ప్రతిబింబించేలా రాయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. ఈ విధంగానే ఇటీవల ఓ ఎంపీకి ఆ పార్టీ హైకమాండ్ షోకాజ్ నోటీసులు ఇవ్వటం జరిగిందని దీని మీద చర్యలు తీసుకోవాలని అన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పరిస్థితి ఇలా ఉండగా వ్యవహారం మొత్తం అదుపు తప్పితే కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటే ' వైకాపా ' కి నష్టమే అని భారీస్థాయిలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు హెచ్చరిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: