దేశంలో కరోనా విలయ తాండవం చేస్తుంది. రోజు రోజుకి కొత్త పాజిటివ్ కేసులు ఊహించని రీతిలో రికార్డు స్థాయిలో బయట పడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. పైగా దేశంలో ప్రస్తుతం వర్షాకాలం రావటంతో వైరస్ వ్యాప్తి చాల ఫాస్ట్ గా, ప్రమాదకరంగా మారే అవకాశం ఉండటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను మెడికల్ సామాగ్రి రెడీగా ఉంచుకోవాలని ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవాలని ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ అలర్ట్ చేస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ లో వైరస్ ప్రభావం ఊహించని రీతిలో ఉండటంతో అక్కడే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పెద్దపెద్ద కార్యాలయాలు మరియు వ్యవస్థలు ఉన్న తరుణంలో ఢిల్లీ ప్రభుత్వంపై విమర్శలు భారీ స్థాయిలో వస్తున్నాయి.

 

ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిద్ర లేవాల్సిన టైం వచ్చిందని చాలా మంది  ఢిల్లీ సర్కార్ పై మండిపడుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో మరియు కొన్నిచోట్ల కరోనా చికిత్స చేస్తున్న వైద్యులకు కూడా సోకుతున్న తరుణంలో  తీవ్రస్థాయిలో కేజ్రీవాల్ సర్కార్ పై విమర్శలు వస్తున్నాయి. దీంతో చాలావరకు పెరుగుతున్న కేసుల సంఖ్య కు తగ్గ రీతిలో వైద్యులు కూడా చికిత్స చేయడానికి ముందుకు రాకుండా ఉండటంతో పాటు మరోపక్క కేసులు ఉన్న కొద్ది పెరుగుతున్న తరుణంలో ఢిల్లీ ప్రజలను భయాందోళన ఉన్న పెద్ద పెరుగుతుంది.

 

ఇదిలా ఉండగా టెస్టుల సంఖ్య పెంచడం వలన కేసుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్న తరుణంలో ప్రజెంట్ ఈ పరిస్థితి ఉందని ఢిల్లీ సర్కారు భావిస్తోంది. మరోపక్క ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో కరోనా వైరస్ ఢిల్లీ లో ఎలా కంట్రోల్ చేయాలి అన్న విషయం గురించి జరిగిన సమావేశంలో ఢిల్లీలో ఉన్నన్ని కుటుంబాలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని డిసైడ్ అవ్వడంతో ప్రస్తుతం ఆ దిశగా ఢిల్లీ సర్కార్ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయటంతో కొత్త పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి అని ప్రభుత్వ అధికారులు అంటున్నారు. ఢిల్లీ కరోనా పాజిటివ్ కేసులు దాదాపు 80 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో దేశ రాజధానిలో ఇలాంటి పరిస్థితి ఉండటం పట్ల దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: