తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎక్కడా తగ్గడం లేదు. ఏదో విధంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి అనేక రీతులుగా నానా పాట్లు పడుతున్నారు. గతంలో కేటిఆర్ ఫామ్ హౌస్ అంటూ నిబంధనలకు విరుద్ధంగా కట్టారంటూ లేనిపోని వ్యాఖ్యలు చేసి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావించారు. కానీ రేవంత్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు మెడకు చుట్టూకునే విధంగా తయారయ్యాయి. హైదరాబాద్ నగరంలో చాలావరకు కాంగ్రెస్ పార్టీ కి చెందిన నేతలు నిబంధనలకు విరుద్ధంగా రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల రీతిలో  భవనాలు కట్టినట్లు ప్రభుత్వం చేసిన సర్వే లలో   బయటపడటంతో ఈ విషయం గురించి మాట్లాడటం అప్పటి నుండి రేవంత్ రెడ్డి సైలెంట్ అయిపోయారు.

 

ఇదిలా ఉండగా తాజాగా ఈసారి భారీ పెద్ద స్కెచ్ తో రేవంత్ కేసిఆర్ ప్రభుత్వానికి చాలా టాఫ్ ఫైట్ ఇవ్వటానికి రెడీ అయినట్లు తెలంగాణ ప్రభుత్వ వర్గాలలో వినబడుతున్న టాక్. అదేమిటంటే కరోనా సమస్య ని బేస్ చేసుకుని రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి సరైన పోరాటం చేయడానికి స్కెచ్ వేసినట్లు సమాచారం. పూర్తి మేటర్ లోకి వెళ్తే దేశంలో అత్యధిక పాజిటివ్ కేసులు కలిగిన మహారాష్ట్రలో  క‌రోనా పాజిటివ్ రేటు 22శాతం ఉంటే, తెలంగాణ‌లో 27శాతం ఉంద‌ని ప్ర‌ధాని దృష్టికి తీసుకు వెళ్ళటానికి రెడీ అయ్యారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఇతర దేశాలకు రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా రాకపోకలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతంలోనే కరోనా భయంకరంగా విలయతాండవం చేస్తున్న తరుణంలో రాష్ట్రంలో అసలు కరోనా నిర్ధారణ పరీక్షలు సరిగా జరగడం లేదని ప్రధానికి లేఖ రాశారు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 లక్షల కరోనా నిర్ధారణ పాజిటివ్ కేసులు టెస్ట్ లు జరుపుతుండగా తెలంగాణలో ఇప్పటి వరకు 70 వేలు మాత్రమే జరిగాయని లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎన్నో ప్రైవేటు మెడిక‌ల్ కాలేజీలు ఉన్న‌ప్ప‌టికీ వాటిని వాడుకోవడం లేదని రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా కార్పొరేట్ ఆస్పత్రిలో  వైద్యం పొందే లేని నిరుపేదలకు  క్వారెంటైన్ లో  అయినా సరైన చికిత్స అందించాలని కోరుతున్నారు. వ్యవహారం మొత్తం అదుపు తప్పెలా కనిపిస్తే, కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాకపోతే  కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతిచోటా  కరోనా  విషయం లో కేసిఆర్  అనుసరిస్తున్న వైఖరిని అరికట్టడానికి  దీక్షలు చేపట్టాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్లు సమాచారం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: