మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఈ సందర్భంగా టిడిపి ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ కక్షపూరితంగా జగన్ ప్రభుత్వం అచ్చెన్నాయుడు విషయంలో వ్యవహరిస్తుందని ఆరోపణలు చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న టైమ్ లోనే వైసీపీ ప్రభుత్వం హాస్పిటల్ నుండి అచ్చెన్నాయుడు ని డిశ్చార్జి చేయటం అమానుషమని దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను అని యనమల రామకృష్ణుడు పేర్కొన్నాడు. వైద్య రంగాన్ని కూడా జగన్ ప్రభుత్వం మేనేజ్ చేయడం దారుణమని వైద్యులపై ఒత్తిడి తీసుకువచ్చి బలవంతంగా అచ్చెన్నాయుడుని డిశ్చార్జ్ చేయించారని…. ఆరోగ్యం బాగా లేని ఇలాంటి టైంలో ఆసుపత్రి నుంచి మళ్లీ జైలుకు పంపించడం బట్టి చూస్తే జగన్ ఎర్రన్నాయుడు కుటుంబంపై కక్ష గట్టి ఉన్నారని యనమల పేర్కొన్నారు.

 

తనని జైలుకు పంపిన అక్కసుతోనే ఇప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులపై కక్ష సాధిస్తున్నట్లు, పదహారు నెలల జైలు జీవితం గడిపిన జగన్ అందరిని కూడా జైలుకు పంపాలని ప్రతీకార చర్యతో వ్యవహరిస్తున్నట్లు యనమల రామకృష్ణుడు సీరియస్ అయ్యారు. అన్ని ఆధారాలతో 108,104 అంబులెన్స్ కుంభకోణం టీడీపీ బయటపెట్టింది కానీ ఈ ఆంబులెన్స్ అవినీతిలో నిందితులపై చర్యలు లేవు, కనీసం ప్రభుత్వం కూడా వివరణ ఇవ్వలేదు అంటూ తీవ్ర స్థాయిలో యనమల రామకృష్ణుడు ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ప్రతిపక్షంగా అక్రమాలు బయట పెట్టడం టీడీపీ నేతలు చేస్తున్న తప్పా అంటూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇంకా సరస్వతి పవర్ కు నీళ్లు కేటాయింపులు గనుల కేటాయింపుల్లో అనేక అవకతవకలు జరిగాయి అంటూ యనమల తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై మండిపడ్డారు.

 

అయితే అన్నీ బాగానే ఉన్నా యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలను కొంతమంది తప్పు పడుతున్నారు. ప్రభుత్వం వంద కోట్లకు పైగా దాటుతున్న ప్రతి టెండర్ ని హైకోర్టు పరిధిలో డిస్కషన్ చేసిన తరువాత న్యాయస్థానం సమక్షంలో టెండర్ విధానాలను ఇతరులకు కేటాయిస్తున్నారు. మరి ఇటువంటి సమయంలో ఆంబులెన్స్ వ్యవహారంలో యనమల రామకృష్ణుడు న్యాయస్థాన పరంగా వెళితే సరైన సమాధానం లభిస్తుంది కానీ ఇలా మైకుల ముందు ఆరోపణలు చేయటం వల్ల నోరు నొప్పి తప్ప ఏమీ ఉండదని లాజిక్ లేని ఆరోపణలు పసలేని విమర్శలు చేస్తున్నారని యనమల పై మండి పడుతున్నారు. ఇక టీడీపీ నేతల అక్రమ అరెస్టులు కేసులు అన్ని విషయములలో జగన్ సర్కార్ ఉన్నది ఉన్నట్టుగానే ఆధారాలతో సహా బయట పెడుతున్నారు. ఈ విషయంలో కూడా న్యాయస్థానం పరంగా వెళితే బాగుంటుంది గాని ఇలా మీడియా ముందు మాట్లాడటం తెలుగుదేశం పార్టీ కే డ్యామేజ్ అవుతుందని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: