ఈరోజుల్లో మీడియా అంటేనే ఓవర్ యాక్షన్ గా మారిపోయింది. ఏదైనా న్యూస్ దొరకగానే దాన్ని సంచలనం చేయడం.. విపరీతంగా గ్లోరిఫై చేసి చెప్పడం అలవాటైపోయింది. అలా చెబితేగానీ జనం చూడరండీ అంటా మీడియా పెద్దలు. అయితే ఇన్నాళ్లూ అలా చెప్పినా నడిచిపోయింది. అలా గ్లోరిఫై చేయడం వల్ల కొన్నిజీవితాలు నాశనం అయ్యాయి.

 

 

అయితే మీడియా వాళ్లకు అవేమీ పట్టవు. మన రేటింగ్స్ మనకు వచ్చాయా లేదా.. మన సర్క్యులేషన్ పెరిగిందా లేదా అన్నదే చూసేవారు. కానీ ఇప్పుడు తొలిసారి మీడియా చేసిన ఓవర్ యాక్షన్ ఫలితాన్ని మీడియానే అనుభవించాల్సి వస్తోంది. ఎందుకంటే.. మీడియా కరోనా వార్తల విషయంలో మొదటి నుంచి సంచలనాత్మక ధోరణే అనుసరించింది. అదిగో.. అక్కడ కరోనా కేసులు.. ఇదిగో ఇక్కడ కరోనా కేసులు.. అంటూ హడావిడి చేసింది.

 

 

కరోనా వస్తే మామాలుగా చావరు.. కుక్క చావు చస్తారు..అసలు కరోనా ఎంత డేంజరో తెలుసా అంటూ నెగిటివ్ కోణంలోనే అప్రోచ్ అయ్యింది. అయితే అనూహ్యంగా అదంతా ఇప్పుడు మీడియాకు బిగ్ మైనస్ అయ్యింది. ఎందుకంటే.. ఈ గ్లోరిఫై కారణంగా సమాజంలో అన్ని వర్గాలూ నష్టపోయాయి. వ్యాపారాలు ఆగిపోయాయి.. వాణిజ్యం దెబ్బతిన్నది.. అన్ని రంగాలూ మూలనపడ్డాయి.

 

 

మరి సమాజంలో అన్నీ బావుంటేనే కదా మీడియా బావుండేది. దీంతో మీడియా మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రకటనలు లేవు.. ఆదాయం లేదు.. దీంతో ఇప్పుడు మీడియా సంస్థలు ఉద్యోగులను ఇంటికి పంపేస్తున్నాయి. అలా.. తాము చేసిన ఓవర్ యాక్షన్ కు తొలిసారి మీడియా ఉద్యోగులు మూల్యం చెల్లించుకుంటున్న కనిపిస్తోంది. ఇప్పటికైనా మీడియా సంచలనాత్మక ధోరణి కాక.. సమాజానికి ఊరటనిచ్చే కోణాల్లో కరోనా వార్తలు ఇవ్వడం మంచిది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: