తప్పు ఎవరు చేసినా కరోనా వైరస్ వల్ల ఇప్పుడు దేశమంతా కష్టాలు అనుభవిస్తుంది.. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా రోజులు గడుస్తున్నాయి.. ఇంకా ఎన్ని రోజులో తెలియదు ఈ దీనావస్ద.. ఇక భయంకరమైన అంటువ్యాధుల జాబితాలో కరోనాను కూడా చేర్చారంటే దీని తీవ్రతను అర్ధం చేసుకోవచ్చూ కానీ కరోనా వచ్చిన వారిని సమాజంలో గానీ, కొన్ని హస్పటల్స్‌లో గానీ ఎంత దారుణంగా చూస్తున్నారంటే, కనీసం వారు మరణించాక కూడా కనికరం లేకుండా నిర్ధాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇందుకు నిదర్శనమే ఇప్పుడు మనం చూడబోయే బెంగళూరులో జరిగిన సంఘటన..

 

 

బెంగళూరులో భవర్‌లాల్ సుజానీ(52) అనే వ్యక్తి మరణించాడు కాగా ఇతనికి కరోనా వైరస్ సోకిందని చనిపోయాక తెలిసింది. అయితే దీనికి ముందు ఇతడు అనారోగ్యంతో బాధపడుతుండగా ఇతని తమ్ముడు ఇంటికి 5 కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రికి తరలించారు.. అయితే లాక్ డౌన్ వల్ల ఆటోలు, కార్లు దొరక్క పోవడంతో స్కూటరుపైనే తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళాక తన అన్నకు పల్స్ 40-50కి పడిపోయిందని. ఊపిరి పీల్చుకోలేక పోతున్నారని చెప్పగా, అతన్ని పరీక్షించిన వైద్యులు ఎక్స్ రే తీసి, ఎక్స్ రేతో పాటు ఒక కాగితంపై ఏదో రాసి ఇచ్చి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ తరిమేశారట.

 

 

ఆ తరువాత అక్కడి నుంచి ఒక అంబులెన్సు మాట్లాడుకుని సమీపంలోని మరో ఆసుపత్రికి వెళ్లగా అక్కడా చేర్చుకోలేదు.. అలా ఒకదాని తరువాత ఒకటి 18 ఆసుపత్రులు తిప్పారు. దినేశ్ తన అన్నను తీసుకెళ్లిన 18 ఆసుపత్రుల్లో కొన్ని ప్రైవేట్, మరికొన్ని ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఉన్నాయట. ఈ క్రమంలో చివరికి సుజానీ మరణించాడు.. అప్పటి వరకు అతనికి ఏమైందన్న విషయం అర్ధం కాలేదని చెబుతూ దినేశ్ బోరున ఏడ్చారు.. ఇకపోతే ఈ బాధ సుజానీదే కాదు. దేశమంతా ఇదే పరిస్థితి ఉందట. కరోనా వైరస్ కారణంగా ఊపిరి తీసుకోలేని స్థితిలో ఉన్న రోగులను చేర్చుకోని కేసుల్లో ఇదే మొదటిది కాదు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న హాస్పిటళ్లు ఇలాగే చేయడం వల్ల ఎందరో రోగులు చనిపోయారట.

 

 

ఇక చాలా ఆసుపత్రులు రోగులను చేర్చుకోకుండా వెనక్కు పంపడంపై ఒకే కథ చెబుతున్నాయి. అదేమంటే ఆసుపత్రిలోని బెడ్లన్నీ నిండిపోయాయని.. అలాంటి చోట కరోనా నిర్దారణ కాని రోగిని చేర్చుకోలేమని చెబుతున్నాయి. ఇదిలా ఉండగా సుజానీ మరణించిన ఒక రోజు తరువాత కర్నాటక ప్రభుత్వం 9 ఆసుపత్రులకు నోటీసులిచ్చింది. నోటీసులు అందుకున్న వాటిలో ఒక ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఉండటం దురదృష్టకరం..

 

 

ఈ విషయంలో కర్నాటక ఆరోగ్య శాఖ కమిషనర్ పంకజ్ కుమార్ పాండే మాట్లాడుతూ  ప్రైవేట్ ఆసుపత్రులు కోవిడ్ రోగులను కానీ, కోవిడ్ అనుమానితులన కానీ, లేక ఆ లక్షణాలు ఉన్నవారిని కానీ చేర్చుకోకుండా తిప్పి పంపించడం, చికిత్సకు నిరాకరించడం వంటివి చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు.. కానీ ఈ నియమాలు ఎందరు పాటిస్తున్నారో అధికారులకే తెలియాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: