దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా పేరు వింటే చాలు ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా కరోనా వైరస్ గురించి శుభవార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న మూడు నాలుగు వ్యాక్సిన్లు వైరస్ విషయంలో ఆశాజనకమైన ఫలితాలను సాధిస్తున్నాయి. అతిత్వరలో వైరస్ ను జయించగలమనే ఆశలను చిగురింపజేస్తున్నాయి. 
 
ఆస్ట్రేలియా వ్యాక్సిన్, చైనలోని కాన్ సెనో, అంతర్జాతీయ ఫార్మా కంపెనీ ఫైజర్ కీలకమైన దశలను దాటుకుని వేగంగా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తున్నాయి. ఫైజర్ కంపెనీ బీ.ఎన్.టీ. 162 బీ1 పేరుతో అభివృద్ధి చేసిన టీకా ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ వాడిన వారిలో ఎక్కువ మొత్తంలో యాంటీబాడీలు విడుదలైనట్లు తేలింది. ఈ వ్యాక్సిన్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ చూపట్లేదని సమాచారం. 
 
చైనీస్ కంపెనీ కాన్ సైనో బయోలాజిక్స్ బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ, అకాడమీ ఆఫ్ మిలటరీ మెడికల్ సైన్సెస్ లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకా విసృత ప్రయోగాల దిశగా సాగుతోంది. ఏడీ5 పేరుతో తయారు చేసిన టీకా తొలిదశ ప్రయోగాల్లో మంచి ఫలితాలు సాధిస్తోంది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీబాడీలు నాలుగు రెట్లు పెరుగుతున్నట్లు తేలింది. 
 
మరోవైపు ఆక్స్ ఫర్డ్ శాస్త్రవేత్త సునేత్ర గుప్త కరోనా వ్యాక్సిన్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతకాలం తరువాత జలుబు మాదిరిగా కరోనా కూడా సాధారణ జీవితంలో భాగమైపోతుందని వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యంగా ఉన్న సాధారణ ప్రజలు వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. గుండె జబ్బు ఉన్నవాళ్లు, వయస్సు ఎక్కువగా ఉన్నవాళ్లు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.                 

మరింత సమాచారం తెలుసుకోండి: