కరోనా మహమ్మారి దేశంలో విసృతంగా వ్యాపిస్తున్న తరుణంలో ఈ వైరస్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించడంతో ఎందరో ఉపాధి కోల్పోయిన పేద, మద్య తరగతి రేషన్‌ దారులకు ఊరటనిచ్చేలా కేంద్రం ప్రభుత్వం ఏప్రిల్‌ నుంచి 3 నెలల పాటు ఉచితంగా 5 కిలోల బియ్యంతో పాటు, కిలో కందిపప్పును పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఇలా కేంద్రం ఇచ్చే 5 కిలోల ఉచిత బియ్యానికి అదనంగా మరో 7 కిలోలు కలిపి మొత్తంగా 12 కిలోల బియ్యాన్ని లబ్ధిదారులందరికి రాష్ట్ర ప్రభుత్వం అందించింది. దీంతో ప్రతీ నెలా ప్రభుత్వం పై రూ.1100 కోట్ల మేర భారం పడినా భరించింది.

 

 

ఇలా గడిచిన మూడు నెలలుగా పంపిణీ చేస్తున్న బియ్యం పథకాన్ని నవంబర్‌ వరకు పొడగించాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. కాగా కేంద్రం ఇస్తున్న 5 కిలోల బియ్యానికి 7 కిలోలు కలిపి గతంలో మాదిరి 12 కిలోలు పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవలసి ఉంది.. ఇక పేదలకు మరో ఐదు నెలల పాటు అంటే నవంబర్‌ వరకు ఉచితంగా ఐదు కిలోల బియ్యం పంపిణీ కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రకటించినప్పటికీ, తెలంగాణ రాష్ట్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. ఇప్పటికే పౌరసరఫరాల శాఖ ప్రభుత్వానికి దీనిపై నిర్ణయం తెలపాలని ఒక ఫైల్‌ పంపిందట..

 

 

ఇకపోతే పేదలకు గతంలో మాదిరిగా ఐదు నెలల పాటు బియ్యం పంపిణీ చేయాలంటే కనీసంగా రూ.5వేల కోట్ల మేర రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. కాబట్టి సీఎం ప్రకటన వచ్చేంత వరకు వేచిచూసే ధోరణిలో ఉన్న పౌర సరఫరాల శాఖ ప్రస్తుతం ఈ నెల ఒకటి నుంచి ఆరంభించాల్సిన రేషన్‌ పంపిణీని ఇంకా మొదలు పెట్టలేదు.

 

 

ఈ విషయంలో తుది నిర్ణయాన్ని మన ముఖ్యమంత్రి ఒకట్రెండు రోజుల్లో తెలియచేస్తాడని ఆయన నిర్ణయం రాగానే పంపిణీ ఏవిధంగా చేయాలో సృష్టత వస్తుందని పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు.ఈ విషయంలో దురదృష్టం అంటే ఇదేకావచ్చు,అమ్మ అనుగ్రహించినా అయ్యా కరుణించలేదు అని పేదలు గుసగుసలాడుకుంటున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: