ఏపీలో మంత్రివర్గ విస్తరణ ముహూర్తం ఇదే ? ప్రస్తుత ఏపీ మంత్రులు గా ఉన్న ఇద్దరు త్వరలో రాజీనామా చేయబోతున్న నేపథ్యంలో వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవడంతోపాటు, మరికొంతమందికి ఈ అవకాశం కల్పించబోతున్నారని, పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి.ప్రస్తుత మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ ఇప్పటికే రాజ్యసభ సభ్యులుగా ఎంపిక కావడంతో వారు తమ ఎమ్మెల్సీ స్థానాలకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే మంత్రి పదవులకు కూడా రాజీనామా చేయబోతున్న ఈ తరుణంలో వారి స్థానం జగన్ ఎవరికి అవకాశం కల్పిస్తారనే ఊహాగానాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. రాజీనామా చేయని మంత్రులు ఇద్దరూ, బీసీ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో, అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను మంత్రిగా జగన్ తీసుకుంటారని, పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

 దీంతో పాటు పనితీరు సక్రమంగా లేని మరో ఇద్దరు మంత్రులను తప్పించి, వారి స్థానం వేరే వారిని తీసుకుంటారనే ప్రచారము కొద్దిరోజులుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో రకరకాల పేర్లు తెరమీదకు వచ్చాయి. జగన్ కు అత్యంత సన్నిహితులు , పార్టీ స్థాపించిన దగ్గర నుంచి తన వెన్నంటే నిలిచిన వారు, మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు అనే ఉత్కంఠ నెలకొంది. అలాగే మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేపట్టబోతున్నారు అనేది ప్రశ్నార్థకంగానే మారిన తరుణంలో ఈనెల 22వ తేదీన క్యాబినెట్ విస్తరణ చేయబోతున్నట్లు తెలుస్తోంది.


 తేదీని కూడా అప్పుడే ప్రకటించడంతో ఇప్పుడు ఆశావహుల్లో మరింత టెన్షన్ పెరిగిపోతోంది. ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాలు చేస్తూ, జగన్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ జగన్ ఎవరిని మంత్రులుగా ఎంపీ చేస్తారు అనే విషయం బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు  తీసుకుంటున్నారు. ప్రస్తుతం క్యాబినెట్ విస్తరణకు సంబంధించి వైసీపీలో హడావుడి నెలకొంది.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: