అనిల్ అంబానీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అధినేత. వ్యాపారంలో కలిసిరాక అప్పుల ఊబిలో కూరుకుపోయారన్న విషయం తెలిసిందే.. అదే సమయంలో తన సంస్థకు చెందిన కార్యకలాపాలను స్వీడిష్ కంపెనీ ఎరిక్‌సన్‌కు అప్పగించాడు.. ఈ ఒప్పందంలో భాగంగా రిలయన్స్ సంస్థ ఎరిక్‌సన్‌కు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా తాత్సారం చేస్తూ రాగా ఎరిక్సన్ సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఆ సంస్దకు 550 కోట్లు చెల్లించాలంటూ సెటిల్ చేసింది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్..

 

 

ఇక ఈ డబ్బులు కట్టలేని పరిస్దితిలో ఉన్న తన తమ్మునికి  ముఖేష్ అంబానీ సహాయం చేసాడు.. కానీ ఈ కధ ఇంతటితో ముగియలేదు. మరోసారి అనిల్ చిక్కుల్లో పడ్డాడు.. ఈ సారి అనిల్ అంబానీకి లండన్ కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇందులో భాగంగా తనకున్న ఆస్తులు, అప్పులు, ఖర్చులు, ఆదాయాల వివరాలను ఈ నెల 20 వ తేదీలోపు వెల్లడించాలని, లేని పక్షంలో జైలుకు పంపిస్తామని, ఆస్తులనూ జప్తు చేస్తామని హెచ్చరించింది. ఇకపోతే మూడు చైనా బ్యాంకులు కలిసి అనిల్ అంబానీ తమకు 717 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.5,354 కోట్ల విలువైన బాకీలను చెల్లించడం లేదంటూ వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా మాస్టర్ డేవిసన్ కమర్షియల్ కోర్టు పై ఆదేశాలు జారీ చేసిందట.

 

 

ఇదిలా ఉండగా ఆర్‌‌కామ్ సంస్ద కోసం అనిల్ అంబానీ పర్సనల్ గ్యారంటీ ఇచ్చి, 900 మిలియన్ డాలర్ల అప్పు తీసుకున్నారని చైనా బ్యాంకులు ఆరోపిస్తున్న నేపధ్యంలో తాను అలాంటి గ్యారంటీ ఏదీ ఆ బ్యాంకులకు ఇవ్వలేదని, అదీగాక ఎలాంటీ బాకీలు చెల్లించే స్తోమత తనకు లేదని అంబానీ వాదిస్తున్నారు. ఇకపోతే 2008 వరకు ఇండియాలోనే ఆరో పెద్ద సంపన్నుడిగా పేరు తెచ్చుకున్న అనిల్ నెట్‌‌వర్త్ విలువ ప్రస్తుతం సున్నాకు చేరిందని ప్రకటించారట. అంతే కాకుండా ఈ విషయాన్ని రుజువు చేయడానికి బ్యాంకు స్టేట్‌‌మెంట్లను, క్రెడిట్‌‌కార్డు వివరాలను కూడా కోర్టుకు అందజేశారట.

 

 

అయితే కోర్టు మాత్రం అనిల్ అంబానీ వాదనతో విబేధిస్తూ అప్పులు కట్టాల్సిందేనని స్పష్టం చేసింది.. ఇలాంటి పరిస్దితుల్లో అంబానీని చూసిన వారు జాలి పడటమే కాదు. ఓడలు బండ్లు అవుతాయి. బండ్లు ఓడలు అవుతాయంటే ఏదో అనుకున్నాం గానీ అనిల్‌ను చూశాక అర్ధం అయ్యిందంటున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: