ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయి, అయినా సరే ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాలే కాదు... ప్రతీ ఒక్కటి పేదలకు అందాల్సినవి అందుతూనే ఉన్నాయి. ఎవరికి ఎక్కడా కూడా అన్యాయం చేయకుండా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా వైద్యం సహా అనేక రంగాల్లో ఏపీ... దూసుకుపోతుంది. నిన్న  దాదాపు 1100 పైగా అంబులెన్స్ లను ఏపీ సర్కార్ మొదలు పెట్టింది. ఇక ఆ కార్యక్రమం చరిత్రలో ఎన్నడు లేని విధంగా జరిగింది. వైద్య చరిత్రలోనే ఇదో సంచలనం అని చాలా మంది అంటున్నారు. 

 

పార్టీల‌కు అతీతంగా ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంసిస్తున్నారు. వెంటిలేటర్ లు ఉండే అంబులెన్స్ లు చాలా తక్కువ. చిన్న పిల్లల కోసం ఉండే అంబులెన్స్ లు కూడా మనకు చాలా తక్కువగా కనపడతాయి. అలాంటిది మండలానికి ఒకటి కేటాయించింది ఏపీ సర్కార్. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌భుత్వాధి నేత‌ల‌తో పాటు అధికారులు సైతం ఈ కార్య‌క్ర‌మం గురించి ఆరా తీశారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని తెలంగాణాలో కూడా అమలు చెయ్యాలి అని సూచనలు చేస్తున్నార‌ట‌. 

 

అక్కడ కూడా 108 అంబులెన్స్ లు ఉన్నాయి అని... అక్కడ కూడా ఇదే విధంగా అమలు చేస్తే పేదల ప్రాణాలను కాపాడిన వారు అవుతార‌ని ప‌లువురు సీఎం కేసీఆర్‌కు సూచ‌న‌లు జారీ చేశార‌ట‌. దీనిపై స‌మ‌గ్ర వివ‌ర‌ణ త‌న‌కు అంద‌జేయాల‌ని కేసీఆర్ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశార‌ని స‌మాచారం. దేశ చరిత్రలోనే  ఇదో కీలక పరిణామం అంటూ కొందరు  కామెంట్స్ చేయడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: