ఈ మద్య డబ్బు కోసం ఎంతటి దిక్కుమాలిన పనులు చేస్తున్నారు.  ముఖ్యంగా బంగారం అంటే పడి చచ్చేవారు దాని కోసం దేనికైనా రెడీ అవుతున్నారు. సాధారణంగా చనిపోయిన తర్వాత మృతదేహాలను కాల్చడమో లేదా పూడ్చడమో చేస్తుంటారు.  వాటికి సమాధులు కట్టించి పెద్దలకు పెట్టుకుంటారు.. ప్రతి సంవత్సవం వారిని గుర్తు చేసుకుంటు సమాధుల వద్ద రోదిస్తుంటారు.  కొన్ని సార్లు సమాధులు తవ్వి శవాలను తీసే పరిస్థితులు వస్తుంటాయి.. అతి ఏదైనా తీవ్రస్థాయిలో కేసుల దర్యాప్తు చేసే సమయంలో మాత్రం. అంతే కాదు సమాధుల జోలికి అంత సులభంగా ఎవరూ వెళ్లరు. ఈ మద్య కొంత మంది డబ్బు పిచ్చి.. బంగారం పిచ్చి ఉన్నవారు చేస్తున్న పిచ్చిపనులకు అందరూ షాక్ అవుతున్నారు.

 

దీని కోసం ఏకంగా శవాన్ని పూడ్చిన స్థలంలో తవ్వకాలు జరిపారు. అంత్యక్రియలు పూర్తి చేసుకొని బంధువులంతా ఇళ్లకు వెళ్లిపోగా.. ఈ దారుణానికి ఒడిగట్టారు. మెదక్ జిల్లాలో గ ఈ ఘటన చోటు చేసుకుంది. గోల్కొండ వీధికి చెందిన కొప్పుల పోచమ్మ(80) గత నెల 24న అనారోగ్యంతో మరణించింది. సంప్రదాయం ప్రకారం ఆమె కుటుంబ సభ్యులు గిద్దకట్ట శ్మశాన వాటికలో పూడ్చి పెట్టారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. అయితే మృతదేహాన్ని పూడ్చే సమయంలో బంగారు ముక్కు పుడకలను తీయకుండానే ఖననం చేశారు.

 

ఇదంతా కాటి కాపరి గమనించాడు.. ముక్కుపుడకల కోసం మళ్లీ సమాధాని తవ్వి తీశారు. రెండు ముక్కు పుడకలు తీసుకొని ఎప్పటిలాగే పూడ్చే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అటువైపుగా వెళ్తున్న కొందరు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం మృతురాలి కొడుకు ఊశయ్యకు కొంత మంది తెలిపారు. అంతే ఇంత దారుణమా.. అని కాటి కాపరిపై నమ్మకంతో ఉంటే ఇలాంటి వెధవ పనులు చేస్తాడా అని పోలీస్ కేసు పెట్టారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: